Begin typing your search above and press return to search.
వైసీపీ వర్సెస్ ఈనాడు... వీర ఉతుకుడే...
By: Tupaki Desk | 13 Oct 2022 8:30 AM GMTఏపీలో పత్రికలు రాజకీయం చేయడం దశాబ్దాల కాలంగా సాగుతున్న ముచ్చట. తమ వారి ప్రయోజనాల కోసం కొన్ని పత్రికలు పనిగట్టుకుని పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. అవన్నీ సాదర జనంలో చర్చకు వచ్చి వారు కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఇపుడు కొన్ని చానళ్ళు, పత్రికలు తీసుకుంటే ఫలానా పార్టీ కొమ్ము కాసేవి అని చాలా సులువుగా జనాలు చెప్పే సీన్ ఉంది.
ఇక ఏపీలో టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ ఎదుగుదలలో ఈనాడు కీలకమైన పాత్ర పోషించింది. చంద్రబాబు హయాంలో కూడా ఆయనకు కొన్ని పచ్చ పత్రికలు అనుకూలంగా ఉన్నాయన్నది జగమెరిగిన సత్యంగా చెబుతారు. ఇక అపుడు చూస్తే ఏపీలో వైస్సార్ ఏలుబడిలో ఈనాడు ఆయనకు ఎదురు నిలిచి పోరాడింది. నాడు కాంగ్రెస్ పార్టీలో జరిగే ప్రతీ విషయాన్ని తనదైన శైలిలో ప్రచురిస్తూ వచ్చింది.
అంతే కాదు ఏపీలో వైఎస్సార్ ఆ రెండు పత్రికలు అంటూ ఏకంగా నిండు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు జనాలకు తెలుసు. ఆయన హయాం అయ్యాక జగన్ తో ఈనాడుకు గట్టిగానే పడింది. అది అలా సాగుతూండగానే ఏపీ విభజన సాగింది. ఇక విభజన ఏపీలో ఈనాడు కొంత తగ్గి న్యూట్రల్ గానే వెళ్తున్నట్లుగా కనిపించింది. జగన్ సర్కార్ మూడేళ్ళ పాలనలో చూసుకుంటే మొదట్లో బాగానే ఉన్నట్లుగా అనిపించినా జగన్ అండ్ కో దుష్ట చతుష్టయం అని పేరు పెట్టి మరీ విమర్శలు చేయడంతో ఈనాడు తన పాత పాత్రలోకి వచ్చేసిందా అంటున్నారు.
ఇక వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో భూ దందా చేస్తున్నారు అని ఈనాడు బ్యానర్లు కట్టి వార్తలు వేయడం జరిగింది. విజయసాయిరెడ్డి కుమార్తె అల్లుడు విశాఖలో భారీ ఎత్తున భూములు కొనడం జరిగిందని కూడా ఆ పత్రిక రాసుకొచ్చింది. దానికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన పేరిట ఒక్క గజమైనా స్థలం కూడా విశాఖలో లేదని, ఉంటే కనుక సీబీఐ విచారణ సహా దేనికైనా రెడీ అని ఆయన ఈనాడుకు సవాల్ చేశారు.
ఇక విశాఖలో ప్రస్తుతం సాగుతున్న దసపల్లా భూముల వ్యవహారంలో కూడా డెవలప్మెంట్‌కు సంబంధించి 71 శాతం వాటా ఏంటి భూ యజమానులకు 29 శాతం వాటా ఏంటి అని తప్పుపడుతున్న వారికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూర్మన్నపాలెంలో యజమానులకు కేవలం ఒక శాతం వాటానే ఇచ్చి 99 శాతం వాటా డెవలపర్ గా వైసీపీ విశాఖ ఎంపీ తీసుకోవడం పట్ల రాయాలి కదా అని ఇండైరెక్ట్ గా తన పార్టీకి చెందిన ఎంపీ మీదనే విజయసాయిరెడ్డి ఈ ప్రెస్ మీట్ లో విమర్శలు చేశారు.
అయితే దాని మీద ఈనాడు మళ్లీ కధనం ప్రచురించింది. అయితే మొత్తం ఎంవీవీ వ్యవహారం బట్టబయలు చేయడమే కాకుండా ఒక బాక్స్ కట్టి మరీ సాయిరెడ్డి సౌజన్యంతో అని రాయడం విశేషం. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారం బయటకు తీశామని కూడా చెప్పుకుంది. అయితే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఇక్కడ భూ యజమానుల వాట ఒక శాతం కూడా లేదని .0.96 శాతమే అని కూడా ఈనాడు కధనంలో సెటైర్లు వేసింది.
ఇలా ఈనాడు వరస కధనాలతో వైసీపీ ఎంపీలను బాగానే టార్గెట్ చేసింది అంటున్నారు. మరి రానున్న రోజున్న ఈనాడులో మరెన్ని వార్తా కధనాలు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా మీడియాతో పెట్టుకుని ఒకటి అని నాలుగు అనిపించుకుంటున్నారా అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.