Begin typing your search above and press return to search.
అమ్మో ఆరో తారీఖు? అప్పట్లో ఎన్టీఆర్ ఏం చేశారంటే!
By: Tupaki Desk | 5 Feb 2022 6:30 AM GMTఅమ్మో ఆరో తారీఖు. ఈ తేదీ వింటే వైసీపీ హడలి పోతోంది. రేపటి అర్ధరాత్రి ఏం జరగనుంది.అర్ధరాత్రికి మునుపు ఏం కానుంది. సమ్మె సైరన్ మోగితే సమస్యకు పరిష్కారం ఏ విధంగా దక్కుతుంది.ఆ రోజు ఎన్టీఆర్ తరువాత కొంతలోకొంత చంద్రబాబు ఇప్పుడు జగన్ వీళ్లంతా ఉద్యోగుల బాధితులే! వీళ్లంతా జీతాల విషయంలోనో పాలన విషయంలోనో పట్టుబట్టిన వారే! ఏ మాటకు ఆ మాట చంద్రబాబు క్రితం సారి ఉద్యోగులు ఏం అడిగితే అవి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కటువుగా ఉన్నా విభజిత ఆంధ్రాలో ఉద్యోగులు అనుకున్నవన్నీ ఆయన హయాంలోనే సాధించి, ఆర్థిక ప్రయోజనాలను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు?
ఏమౌతుంది..?
రేపు అన్నది ఓ పెద్ద భ్రమ కావొచ్చు.కానీ ఇవాళ అన్నది ఆ భ్రమ కు కారణం కావొచ్చు కూడా! కనుక సమ్మెకు పోయే ఉద్యోగ సంఘాలు అన్నీ ఓ సారి ఆలోచించి తరువాత ఆచరణకు ప్రయార్టీ ఇస్తే మేలు. ఎందుకొచ్చిన గొడవ అని సర్దుకుపోవడం అన్నది ఓ మంచి పద్ధతి కావొచ్చు ఏపీ ప్రభుత్వానికి! ఇరు వర్గాలూ సామరస్య ధోరణిలో ఆలోచిస్తే మంచి ఫలితాలు వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కాలంలో కూడా ఓ సారి సమ్మెకు సైరన్ మోగింది. మరి! ఆ వేళ ఏం జరిగింది అన్న
ఆసక్తిదాయక చర్చ ఒకటి తీవ్ర స్థాయిలో నడుస్తోంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు. 1986లో యాభై మూడు రోజుల పాటు సమ్మె చేసి ఎన్టీఆర్ ను తమ దార్లోకి తెచ్చుకున్నారు నాటి ఉద్యోగులు. అప్పుడు ఎన్టీఆర్ చాలా కఠినంగానే ఉద్యోగుల విషయమై వ్యవహరించి, ఉన్న పళాన పెను వివాదాలకు తావిచ్చేలా ప్రవర్తించారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్టు చేయించడం, తరువాత ప్రత్యామ్నాయాలను వెతకడం వంటివి చేశారు. ఆ రోజు పాలనను స్తంభింపజేస్తూ రాస్తారోకోలు ధర్నాలు చేసిన కూడా ఉద్యోగుల విషయమై ఎన్టీఆర్ కొంత వరకూ కాదు పూర్తి స్థాయిలో కఠినంగానే వ్యవహరించి వివాదాన్ని తీవ్రం చేశారు.అప్పుడు కూడా పెన్డౌన్ చేసి ఉద్యోగులు తమ పంతం నిలబెట్టుకున్నారు.
ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ కరగలేదు. ఉద్యోగులకు దాసోహం కాలేదు.కొత్త పీఆర్సీ అమలుపై ఆ రోజుకూడా ఇదే పంతంలో ఉద్యోగులు ఉన్నారు.ఐఆర్ ను మూల వేతనంలో కలిపాలని , అదేవిధంగా మూలవేతనాన్ని 740 నుంచి 750 రూపాయలకు పెంచాలని పట్టుబట్టారు. వాటినేవీ పట్టించుకోలేదు ఎన్టీఆర్.ఆఖరికి వామపక్షాల ఎంపీ సుకుమార్ సేన్ మధ్యవర్తిగా వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.ఆయన అప్పట్లో అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా కూడా ఉండడంతో ఇరు వర్గాలనూ ఒప్పించి సమ్మెకు తెరదించారు.అటుపై జరిగిన 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయారు.ఇప్పుడు కూడా జగన్ ఇదే భయం పట్టుకుంటుంది. రేపటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగులంతా సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎలా చేయాలి అన్న ఆందోళన అయితే ఉంది.ఆ విధంగా కాకుండా చర్చలతోనే సామరస్య పూర్వక పరిష్కారం వస్తే సమ్మె అన్న పదానికి ఇక చోటుండకుండా పోతుంది.