Begin typing your search above and press return to search.

బాబూ..ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ ఆవేద‌న విన్నారా?

By:  Tupaki Desk   |   12 May 2017 6:19 AM GMT
బాబూ..ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ ఆవేద‌న విన్నారా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌లు వింటే.. ఏపీలో అభివృద్ధి జెట్ స్పీడ్‌ లో సాగుతున్న‌ట్లుగా అనిపిస్తుంది. ఇక‌.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల మాట‌లు వింటే.. గ‌డిచిన మూడేళ్ల‌లో ఏపీ ఎంత‌గా మారిపోయిందో అన్న‌ట్లుగా ఉంటుంది. మాట‌ల్ని ప‌క్క‌న పెట్టి.. వాస్త‌వంలోకి వెళితే మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంటుంది. తాజాగా ఏపీ ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ వాసుదేవ దీక్షితులు మాట‌లు వింటే.. ఏపీలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అవుతున్నా.. ఏపీ రాజ‌ధానిలో ప్రెస్ అకాడ‌మీకి ఇంత‌వ‌ర‌కూ సొంత భ‌వ‌నం అంటూ కేటాయించ‌లేద‌న్న నిజాన్ని ఆయ‌న చెప్పారు. ఆరువేల అడుగుల స్థ‌లం కావాల‌ని ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల్ని కోరితే ఇస్తామ‌ని చెబుతున్నారు కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ్వ‌లేద‌న్నారు. ప్రెస్ అకాడ‌మీకి సొంత భ‌వ‌న‌మే కాదు.. సొంత సిబ్బంది కూడా లేద‌ని వాపోయారు.

చివ‌ర‌కు త‌న బ్రీఫ్ కేసే త‌న ఆఫీసుగా మారిపోయింద‌న్న ఆయ‌న‌.. నా బ్రీఫ్ కేసే నా ఆఫీసు అంటూ అస‌లు విష‌యాన్ని చెప్పేశారు. ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా రాష్ట్రంలో ప్రెస్ అకాడ‌మీ ఉందా? అన్న సందేహం క‌లుగుతుంద‌న్న ఆయ‌న‌.. ఈ భావ‌న జ‌ర్న‌లిస్టుల‌లోనే కాదు ప్ర‌జ‌ల్లోనూ ఉంద‌నటం గ‌మానార్హం.

రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య 140 అంశాలు ఉంటే.. అందులో ప్రెస్ అకాడ‌మీ కూడా ఒక‌ట‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన వాసుదేవ దీక్ష‌కుతులు.. ప్రెస్ అకాడ‌మీ ఒక యూనివ‌ర్సిటీ లాంటిద‌ని.. తాను అందులో వీసీ లాంటి వాడిన‌ని చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌ను క‌లిసిన ప‌లువురు జ‌ర్న‌లిస్టులు.. తెలంగాణ రాష్ట్రంలోని పాత్రికేయుల కోసం అక్క‌డి స‌ర్కారు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మంలో సగం కూడా ఏపీ స‌ర్కారు చేయ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మీడియా ఫ్రెండ్లీ ముఖ్య‌మంత్రిగా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకునే సీఎం చంద్ర‌బాబు.. ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ మాట‌ల్ని.. జ‌ర్న‌లిస్టుల ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/