Begin typing your search above and press return to search.

రోజాను చూసి బెదిరిపోతున్న బాబు అండ్ కో!

By:  Tupaki Desk   |   5 March 2017 5:01 AM GMT
రోజాను చూసి బెదిరిపోతున్న బాబు అండ్ కో!
X
బెజ‌వాడ‌లో అధిక వ‌డ్డీల‌కు అప్పులిచ్చి... ఆపై వ‌సూళ్ల కోస‌మంటూ బాధితుల ఇళ్ల‌కు వ‌చ్చి నానా యాగీ చేయ‌డ‌మే కాకుండా బాధిత మ‌హిళ‌ల‌ను లైంగికంగా దోచుకుంటూ స్వైర విహారం చేసిన కాల్ మ‌నీ సెక్స్ రాకెట్ గుర్తుందిగా. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా వ్య‌వ‌హ‌రించిన కాల్ మ‌నీ సెక్స్ రాకెట్ గాళ్ల‌పై ఓ మ‌హిళా ఎమ్మెల్యేగా వైసీపీ కీల‌క నేత‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా... చంద్ర‌బాబు స‌ర్కారును బ‌జారులో నిల‌బెట్టేశారు. మ‌హిళ‌ల మాన ప్రాణాల‌ను దోచుకున్న కాల్ మ‌నీ నిందితుల‌పై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ ఆమె అసెంబ్లీ సాక్షిగా చేసిన దాడికి చంద్ర‌బాబు అండ్ కో బెంబేలెత్తిపోయింది. మ‌రిన్ని రోజులు రోజా స‌భ‌లో ఉంటే... త‌మ బండారం మ‌రింత‌గా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావించిందో, ఏమో తెలియ‌దు గానీ... రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేశారు.

2015 డిసెంబ‌ర్ 18న బాబు స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకోగా... ఇప్ప‌టికే ఆ గ‌డువు ముగిసింది. ఇక రేపు వెల‌గపూడిలో కొత్త‌గా ప్రారంభ‌మైన భ‌వంతిలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రగ‌నున్నాయి. స‌స్పెన్ష‌న్ గ‌డువు ముగిసిన నేప‌థ్యంలో ఈ స‌మావేశాల‌కు రోజా హాజ‌రు కావ‌డం ఖాయ‌మే. అయితే కాల్ మ‌నీపై రోజా విరుచుకుప‌డిన తీరు... ఇప్ప‌టికీ టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తూనే ఉంద‌నే చెప్పాలి. రెండు రోజుల్లో స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న‌గా... నిన్న ప్రివిలేజ్ క‌మిటీ అత్య‌వ‌స‌రంగా వెల‌గ‌పూడి అసెంబ్లీలో స‌మావేశ‌మైంది. టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఉద్దేశ‌పూర్వ‌కంగా హాజ‌రుకానీయ‌కుండానే స‌మావేశాన్ని ముగించేశారు.

ఈ స‌మావేశంలో రోజా స‌స్పెన్ష‌న్ ను మ‌రో ఏడాది పాటు పొడిగిస్తున్న‌ట్లుగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మీడియాకు లీకులిచ్చేశారు. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశాన్ని ప‌తాక శీర్షిక‌లు పెట్టి ప్ర‌చురించేసింది కూడా. ఈ క‌మిటీ త‌న నిర్ణ‌యాన్ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ కు నివేదిస్తే.. స్పీకర్ కార్యాల‌యం నుంచి రోజా స‌స్పెన్ష‌న్‌ కు సంబంధించిన ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి. రేపు ఉద‌య‌మే అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నందున... నేటి సాయంత్రంలోగా స‌స్పెన్ష‌న్ ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయి. అవ‌కాశాలున్నాయి అనేకంటే కూడా... ఖాయంగా నేటి సాయంత్రంలోగా ఈ ఉత్త‌ర్వులు వెలువ‌రించేందుకు బాబు స‌ర్కారు కార్య‌రంగాన్ని సిద్ధం చేసింద‌ట‌. ప్ర‌భుత్వ తీరుపై సూటిగా విమ‌ర్శ‌లు సంధించే రోజా లాంటిట విప‌క్ష ఎమ్మెల్యేలంటే ఎవ‌రికైనా బెరుకే. ఆ కోవ‌లోనే రోజా అంటే తాము కూడా భ‌య‌ప‌డుతున్నామ‌న్న విష‌యాన్ని స‌స్పెన్ష‌న్ ఉత్త‌ర్వుల ద్వారా టీడీపీ ఒప్పుకోనుంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/