Begin typing your search above and press return to search.

అప్పుల్లో దూసుకొని పోతున్న ఏపీ!

By:  Tupaki Desk   |   3 March 2021 5:30 AM GMT
అప్పుల్లో దూసుకొని పోతున్న ఏపీ!
X
కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడు అప్పులు చేయని మనిషి లేరు. అంబానీ నుంచి భారత సర్కార్ వరకు.. అదానీ నుంచి సామాన్యుల వరకు అందరూ అప్పులు చేసిన వారే. ఇక రాజధాని కూడా లేని ఏపీ కరోనా లాక్ డౌన్ తో మరింత కృంగిపోయింది.

ఏపీలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జగన్ సర్కార్ నవరత్నాలు సహా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రూపాయి లేకున్నా అప్పులు తెచ్చి పంచుతోంది. అప్పు చేసి పప్పుకూడును పంచుతోంది. ఏపీ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయికి అప్పులు చేరుకున్నాయి. తాజాగా కాగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏపీ చేస్తున్న అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10నెలల లెక్కలను తాజాగా కాగ్ విడుదల చేసింది. ఈ 10 నెలల్లో రూ.73913 కోట్ల అప్పులు చేసినట్లు తెలిసిన కాగ్.. అంచనాల కన్నా 153శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు తెలిపింది.

రూ.100 ఖర్చు చేస్తే అందులో రూ.45 రుణమేనన్న కాగ్.. అప్పుల్లో దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అటు రెవెన్యూ లోటు అంచనాల కన్నా 300శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

దేన్నేతై ఏపీలో నిషేధించారో అదే ఏపీ సర్కార్ ఆదాయం అవుతోంది. మద్యపానం ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తోంది. ఏపీ మొత్తం ఆదాయంలో 14శాతం ఆదాయం లిక్కర్ ద్వారానే వస్తోంది.

దేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఘోరంగా ద్రవ్యలోటు 35శాతం నమోదు కావడం గమనార్హం. సాధారణంగా 5శాతం ద్రవ్యలోటు దాటితేనే ప్రమాదమని ఆర్థిక నిపుణులు చెబుతారు. కానీ అధ్వానం అంటే 15-20శాతంగా పేర్కొంటారు. కానీ ఇక్కడ ఏపీ ద్రవ్యలోటు 35శాతం ఉండడం ఏపీ దివాళా తీసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.