Begin typing your search above and press return to search.
ఏపీలో ఘోరం: వివాహితపై అత్యాచారం.. హత్య
By: Tupaki Desk | 28 April 2022 11:30 AM GMTఏపీలో కొందరు మృగాళ్లు రెచ్చిపోతున్నారు.కామంతో ఆడపిల్లలను చెరిచేస్తున్నారు. విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం మరిచిపోకముందే మరో దారుణం వెలుగుచూసింది. గుంటూరు జిల్లాలో ఈ ఘోరం జరిగింది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల తుమ్మపూడి ఇందుకు వేదికైంది. వివాహితపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. జగన్ సర్కార్ లో మహిళలకు రక్షణ లేదా? అని ఆరోపించాయి.
ఏపీలో వరుసగా జరుగుతున్న అత్యాచారాల పరంపర విస్తుగొలుపుతోంది. వారిపై కఠినచర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కావని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తుమ్మపూడికి చెందిన మహిళ పొలాలకు నీళ్లు పెట్టుకునే పైపులను అద్దెకిస్తూ జీవిస్తోంది. ఈమె భర్త తిరుపతిలో పనిచేస్తూ అప్పుడప్పుడూ భార్య దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం ఆమెపై ఇంట్లోనే అత్యాచారం , హత్య జరగడం సంచలనమైంది.
గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై రక్కిన, కొరికిన తీవ్రగాయాలుండడం చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అలాగే మహిళను బట్టల్లేకుండా వివస్త్రగా చేశారు. దీంతో సామూహిక అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మృతిరాలి భర్త నలుగురిపై అనుమానం వ్యక్తం చేశారు. వారు తన భార్యను వేధిస్తున్నట్టు పోలీసులకు వివరించాడు. వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించాడు.
సంఘటనా స్థలాన్ని టీడీపీ నేతలు, సందర్శించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు సాగుతున్నాయని విమర్శించారు.