Begin typing your search above and press return to search.

ప్రాణాలు నిలిపే పట్టాలు - ఏపీకి 800 బెడ్స్ తో మొబైల్ రైల్వే ఆస్పత్రులు

By:  Tupaki Desk   |   10 April 2020 3:59 PM GMT
ప్రాణాలు నిలిపే పట్టాలు - ఏపీకి 800 బెడ్స్ తో మొబైల్ రైల్వే ఆస్పత్రులు
X
ఇతర దేశాలతో పోలిస్తే... అత్యధిక జనసాంద్రత ఉన్న కంట్రీ అయినా కూడా భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలా చాలా వేగంగా - క్రియేటివ్ గా పనిచేస్తోంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుంటు ఇతర దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇండియా తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి రైల్వే బోగీలను ఐసోలేటెడ్ బెడ్స్ కలిగిన ఆస్పత్రులుగా మార్చడం. ప్రపంచంలో అనేక మందిని ఆశ్చర్యపరిచింది. దీనివల్ల అనేక రకాల లాభాలున్నాయి. చాలావేగంగా అత్యధిక బెడ్లను అందుబాటులోకి తేవడం - దేశంలో ఎక్కడికి అవసరమైతే అక్కడికి ఆస్పత్రిని తరలించే అవకాశం ఉండటం ప్రధానమైని. ఇపుడు ఈ సౌలభ్యం వల్ల ఏపీకి కూడా నాలుగు రైల్వే ఆస్పత్రులు చేరుకున్నాయి.

ఇప్పటివరకు కేంద్రం 5 వేల భోగీలను (80 వేల బెడ్లు) ఆస్పత్రులుగా మార్చింది. వీటిలో సిబ్బందికి తగిన సదుపాయాలు - రోగులకు ఐసోలేషన్ బెడ్లు ఉంటాయి. ఆస్పత్రిలో ఉన్న చాలా సదుపాయాలు ఇందులో సమకూర్చారు. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేకి 486 కోచ్‌ లను రైల్వే శాఖ కేటాయించింది. అంటే 7,776 ఐసోలేషన్ బెడ్స్ అన్నమాట. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల పంచారు. ఆంధ్రప్రదేశ్‌ లోని నర్సాపురం - మచిలీపట్నం - కాకినాడ - విజయవాడ స్టేషన్లకు ఇప్పటికే 50 కోచ్‌ లను పంపినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఈ 800 ఐసోలేషన్ బెడ్స్ కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అవసరాన్ని బట్టి వీటిని ఏపీలో ఎక్కడికైనా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది.

దేశవ్యాప్తంగా కరోనా పెరుగుదలను బట్టి అవసరమైతే మరో 20,000 కోచ్‌ లను అంటే 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌ ను అందుబాటులోకి తేవడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. ఇందులో సిబ్బంది ఉండటానికి సదుపాయాలు కూడా కల్పించడం విశేషం. అవసరాన్ని బట్టి ఆయా స్టేషన్లలో ఉంచుతారు. పైగా రైళ్లు నడవక పోవడం వల్ల ఇపుడు స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. అవసరాన్ని బయట్టి ఆయా స్టేషన్లను ఈ కోచ్ ల సహాయంతో ఆస్పత్రులుగా వినియోగిస్తారు.