Begin typing your search above and press return to search.
మహమ్మారీ పరీక్షలు - రికవరీల్లో ఏపీ రికార్డ్!
By: Tupaki Desk | 3 Jun 2020 5:30 PM GMTమహమ్మారి వైరస్ పరీక్షల నిర్వహణలో.. రికవరీ రేటులో ఏపీ రికార్డ్ సృష్టించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో మహమ్మారి వైరస్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును నమోదు చేసింది. ప్రతీరోజు 12వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. పరీక్షలే కాదు.. రోగులకు మెరుగైన సదుపాయాలన్నీ అందిస్తున్నట్టు ఏపీ నోడల్ అధికారులు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చేయడం రికార్డ్ గా మారింది. ఏపీలో 3,95,681 పరీక్షలు జరగగా.. 3,91,890 మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇక ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి రేటు విషయంలోనూ ఏపీ గణనీయమైన ముందడుగు వేసింది. దేశంలో వైరస్ నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు 48శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 45శఆతం ఉంది. అదే ఏపీలో ఏకంగా 69శాతం రికార్డు ఉండడం విశేషం. ప్రస్తుతం ఏపీలో 3200 పాజిటివ్ కేసులున్నాయి. 64మంది ఇప్పటివరకు చనిపోయారు. ఇలా వైరస్ పరీక్షల్లోనూ.. రికవరీల్లోనూ ఏపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించింది.