Begin typing your search above and press return to search.
సామాజిక, ఆర్థిక సర్వే: అన్ని రంగాల్లో ఏపీ ముందంజ
By: Tupaki Desk | 16 Jun 2020 7:45 AM GMTసామాజిక ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ సర్వే నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.
వైఎస్ జగన్ ఏడాది పాలనకు గీటురాయిగా ఈ సామాజిక, ఆర్థిక సర్వే నిలబడడం విశేషం. నవరత్నాల్లో భాగమైన విద్య, వైద్యం, సామాజిక భద్రత అంశాలు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం వంటి అంశాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సర్వే పేర్కొంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,72,782 కోట్లుగా ప్రణాళిక విభాగం పేర్కొంది. స్థిర ధరల వద్ద రాష్ట్రస్థూల ఉత్పత్తి రూ.672018 కోట్లుగా ఉందని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 12.73శాతం మేరకు జీఎస్డీపీలో వృద్ధి కనిపించిందని సర్వే తెలిపింది.మొత్తంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 8.16శాతంగా ఉందని సర్వే తెలిపింది.
ప్రస్తుత జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా రూ.320218 కోట్లు, పరిశ్రమ రంగం వాటా 191857 కోట్లు, సేవల రంగం వాటా 367747 కోట్లుగా ప్రణాళిక విభాగం పేర్కొంది. వ్యవసాయ రంగం వాటా 18.96శాతం పెరిగింది. పరిశ్రమల వాటా 5.67శాతం వృద్ధి చెందింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా భారీ పెరిగింది.
+ ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికలోని ముఖ్యాంశాలు
-రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.69 లక్షలకు పెరుగుదల
-తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల (దేశ సరాసరి తలసరి ఆదాయం రూ. 1.34 లక్షలు మాత్రమే)
రాష్ట్రంలో గతేడాది అక్షరాస్యత 67.35 శాతం
-స్థిర ధరల్లో జీఎస్‌డీపీ రూ. 6,72,018 కోట్లు
-వ్యవసాయ రంగంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ)
11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ
-పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి
-సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి
- ప్రస్తుత ధరల్లో 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)
రూ. 1.10 లక్షల కోట్ల జీఎస్‌డీపీ పెరుగుదల
-స్థిర ధరల్లో 8.16 శాతం జీఎస్‌డీపీ పెరుగుదల (దేశంలో సగటున 5 శాతం)