Begin typing your search above and press return to search.

ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు: ‌కొత్త‌గా 7,998 పాజిటివ్.. 61 మంది మృతి

By:  Tupaki Desk   |   23 July 2020 1:30 PM GMT
ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు: ‌కొత్త‌గా 7,998 పాజిటివ్.. 61 మంది మృతి
X
భారీ సంఖ్య‌లో టెస్టులు చేస్తుండ‌డంతో ఏపీలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్య‌లో నమోద‌వుతున్నాయి. నిన్న ఆరు వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా తాజాగా గురువారం ఊహించ‌ని రీతిలో కేసులు పెరిగాయి. ఏకంగా 7,998 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. మృతుల సంఖ్య 61 న‌మోదైంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 24 గంట‌ల్లో 58,052 న‌మూనాలు ప‌రిశీలించ‌గా పైగా కేసులు న‌మోద‌య్యాయ‌ని వైద్యారోగ్య శాఖ వివ‌రించింది. దేశంలోనే రికార్డు స్థాయిలో ఏపీలో కేసులు న‌మోద‌వుతుండ‌డం ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌లో ప‌డేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో పెద్ద సంఖ్య‌లో వైర‌స్ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో 14మంది మృత్యువాత ప‌డ్డారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, క‌ర్నూలు జిల్లాలో ఏడుగురు.. కృష్ణా జిల్లాలో ఆరుగురు.. శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు.. విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో ఐదుగురు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఐదుగురు.. చిత్తూరు జిల్లాలో ముగ్గురు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ముగ్గురు.. ప్ర‌కాశం జిల్లాలో ముగ్గురు.. వైఎస్సార్ క‌డ‌ప‌.. అనంత‌పుర‌ము జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున మృతిచెందారు.

తాజాగా వైర‌స్ నుంచి కోలుకున్న వారు 4,428మంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా చేసిన టెస్టుల సంఖ్య 14,93,879. కొత్త కేసుల‌తో క‌లిపి రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసులు 72,711. ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 34,272. వైర‌స్ నుంచి కోలుకుని ఇప్ప‌టివ‌ర‌కు డిశ్చార్జ‌యిన వారి సంఖ్య 37,555. వైర‌స్‌తో బాధ‌ప‌డుతూ మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 884.