Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా రికార్డ్స్ బ్రేక్ ..ఒక్కరోజే 10 వేలకి పైగా కేసులు !
By: Tupaki Desk | 29 July 2020 1:30 PM GMTఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70584 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 10093 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య1,20,390 కి చేరింది. ఒక్కరోజులో 10 వేలకి పైగా కరోనా కేసులు రావడం రాష్ట్రంలో ఇదే తోలిసారి. ప్రస్తుతం 63771 యాక్టివ్ కేసులు ఉండగా..55406 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1213కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో1371 కరోనా కేసులు నమోదయ్యాయి.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలుః అనంతపురంలో1371, చిత్తూరులో 819, ఈస్ట్ గోదావరిలో 1676, గుంటూరులో 1124 కడపలో 734, కృష్ణలో259, కర్నూలులో 1091, నెల్లూరులో608, ప్రకాశంలో 242, శ్రీకాకుళంలో 496, విశాఖపట్నంలో 841, విజయనగరంలో 53 వెస్ట్ గోదావరిలో 779 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 18,20,009 సాంపిల్స్ ని పరీక్షించారు.