Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా పంజా.. మళ్లీ రికార్డు కేసులు
By: Tupaki Desk | 9 July 2020 11:00 AM GMTఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నాలుగైదు రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 16882 పరీక్షలు చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 53మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికీ వైరస్ సోకింది. వారితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1555కి చేరాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23814కు చేరింది. గడిచిన 24 గంటల్లో 13మంది చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 277కి చేరింది.
గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 236 కేసులు నమోదు కాగా.. తరువాత గుంటూరు విశాఖ, శ్రీకాకుళంలో కూడా 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 17 కేసులు నమోదయ్యాయి.
ఏపీలోనే అత్యధికంగా కరోనా కేసులు కర్నూలులో మొత్తం 2795 నమోదయ్యాయి.