Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 2,593.. 40 మంది మృత్యువాత
By: Tupaki Desk | 16 July 2020 11:10 AM GMTమహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్ కల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా ఒక్కరోజే 2,584 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఏకంగా 40 మంది మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండగా ఊహించని రీతిలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 22,304 పరీక్షలు చేయగా గురువారం వాటి ఫలితాలు వెల్లడయ్యాయి. తాజాగా 943 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు.
వీటితో కలిపి మొత్తం కేసులు 38,044కి చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 18,159. మొత్తం మృతుల సంఖ్య 492కి చేరింది. అనూహ్యంగా కేసులు పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం ఆందోళనలో పడింది. వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలపై సమాలోచనలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైరస్ వ్యాప్తి తీరు.. కట్టడి చర్యలు వంటి వాటిపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.