Begin typing your search above and press return to search.
ఏపీలో ఒక్కరోజే భారీగా కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే ?
By: Tupaki Desk | 28 July 2020 12:10 PM GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో7948 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య1,07,402 కి చేరింది. ఇందులో 56,509 యాక్టివ్ కేసులు ఉండగా..49745 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 24 గంటల్లో ఈ కరోనా వల్ల 58 మంది మరణించారు. వీటితో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 1148కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1367, కర్నూలులో 1146 కరోనా కేసులు నమోదయ్యాయి.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు అనంతపురంలో 740, చిత్తూరులో 452, ఈస్ట్ గోదావరిలో 1367, గుంటూరులో 975, కడపలో 650, కృష్ణలో293, కర్నూలులో 1146, నెల్లూరులో369, ప్రకాశంలో 3351, శ్రీకాకుళంలో 392, విశాఖపట్నంలో 282, విజయనగరంలో 220, వెస్ట్ గోదావరిలో 757 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 17,49,425 సాంపిల్స్ ని పరీక్షించారు.