Begin typing your search above and press return to search.

120 ఎకరాలే.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ట్విస్ట్!

By:  Tupaki Desk   |   20 March 2021 1:30 PM GMT
120 ఎకరాలే.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ట్విస్ట్!
X
చంద్రబాబు పోయాడు.. జగన్ వచ్చాడు.. అమరావతి పోతోంది.. విశాఖ వస్తోంది. ప్రభుత్వాలోపాటు అన్నీ మారిపోతుంటాయి. తాజాగా ఏపీలోని తొట్లకొండలో గల బుద్దిస్టు కాంప్లెక్స్ కు కేవలం 120.88 ఎకరాలు మాత్రమే ఉందని జగన్ సర్కార్ స్పష్టం చేసింది. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రకటన విడుదల చేసింది.లేదంటే అదే ఖాయం చేస్తామని.. మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపడుతామని పేర్కొంది.

విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం కాపులప్పాడ గ్రామ సర్వే నంబర్ 314లో మొత్తం 3143.40 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడే ఏపీ రాజధాని ప్రాంతం చేయాలని.. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. అయితే ఈ ప్రాంతం బుద్దిస్ట్ ప్రాంతమని సామాజికవేత్తలు అంటున్నారు. కొండ ప్రాంతం కావడం.. నిర్మాణాలకు స్థలాలు ఉండడంతో కొందరు దీనిపై కోర్టులను ఆశ్రయించారు. గత ప్రభుత్వం ఇక్కడ ఏపీ ఫిల్మ్ నగర్ క్లబ్ కు 15 ఎకరాలు కేటాయించింది. దీనిపై కోర్టుకు పలువురు ఎక్కారు.

ఈ వివాదాస్పద స్థలంపై వైసీపీ సర్కార్ కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది.. తొట్లకొండలో పురావస్తు శాఖకు చెందిన స్థలం కేవలం 120.88 ఎకరాలేనని.. మిగిలినందంతా వేరే స్థలమని పాత రికార్డులు తీశారు. అందులో నిర్మాణాలకు ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.

ఇంకో నెలరోజులు చూసి బుద్దిస్టుకాంప్లెక్స్ ను తొట్లకొండ నుంచి ప్రభుత్వం విడదీసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతంలో ఏపీ సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ లాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై బుద్దిస్టు ప్రొటెక్షన్ కమిటీ కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యింది. ఇది నిబంధనలకు విరుద్ధం అని.. బుద్దిస్టు కేంద్రాన్ని పరిరక్షించుకుంటామని ఆ కమిటీ తెలిపింది.