Begin typing your search above and press return to search.
ఎంగిలాకులు ఎత్తి.. శవాల దగ్గర ముగ్గులు జల్లుతున్నాం.. : ఏపీలో సర్పంచుల గోలగోల
By: Tupaki Desk | 21 Sep 2022 2:30 AM GMTగ్రామంలో అభివృద్ధి పనులు జరగాలంటే సకాలంలో నిధులు మంజూరు కావాలి. అలా లేని పక్షంలో అభివృద్ధి కుంటుపడుతుంది. తాజాగా కోనసీమ జిల్లాలో పంచాయతీ నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి 14, 15 ఆర్థికసంఘం నుంచి నిధులు పంచాయతీలకు అందాయి. అయితే.. ప్రభుత్వం వాటిని తన ఖాతాలో జమ చేసుకుంది. దీనిపై ఇటీవల అసెంబ్లీలోనూ రగడ జరిగింది. అయితే.. సర్కారు మాత్రం సమర్థించుకుంది.
ఇదిలావుంటే.. కోనసీమ జిల్లాలో సర్పంచులు రోడ్డెక్కారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే మృతదేహాల దగ్గర ముగ్గు చల్లటం, పెళ్లిళ్లు జరిగిన చోటకు వెళ్లి ఎంగిలి విస్తరాకులు ఎత్తడం తప్ప ఏమీ చేయలేకపో తున్నామంటూ వాపోయారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆందోళనకు దిగేందుకు వెనకాడబోమని చెప్పారు.
ఈమె ఒక్కరే కాదు.. రాష్ట్రంలోని చాలా మంది సర్పంచులు ఇదే తరహా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సర్పంచులు బిక్షాటన చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సత్యసాయి జిల్లాలో.. చెప్పులు కుట్టి.. ఆ నిధులతో పంచాయతీలకు పనులు చేయిస్తామని.. సర్పంచులు ఆందోళనకుదిగారు. ఇవన్నీ.. రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నకార్యక్రమాలే. అయితే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
గతంలో చంద్రబాబు హయాంలోపంచాయతీలు పెండింగులో ఉన్న విద్యుత్ బిల్లలనే తాము జమచేసు కుంటున్నామని.. ఇటీవల అసెంబ్లీ వేదికగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ.. ఇలా చేయడం వల్ల పంచాయతీలు నాశనం అవుతున్నాయనేది.. సర్పంచుల ఆవేదన. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. వైసీపీకి చెందిన సానుభూతిపరులు.. ఆ పార్టీ మద్దతు దారులైన సర్పంచులే రోడ్డెక్కడం..!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.