Begin typing your search above and press return to search.
రెండుగా చీలిన ఏపీ ఉద్యోగులు
By: Tupaki Desk | 29 Dec 2016 4:38 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ కేంద్రంగా పరిపాలన ప్రారంభించాలనే ఉద్దేశంలో భాగంగా వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మించి మరీ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఊహించని ట్విస్ట్ ఎదురవుతోందని అంటున్నారు. అది కూడా సాక్షాత్తు ఉద్యోగుల రూపంలో ఒక రకంగా బాబును బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా సర్కారు అన్ని శాఖల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తుండగా - ఎక్కడా లేని విధంగా ఒక్క సచివాలయ ఉద్యోగుల నుంచే అభ్యంతరాలు - సహాయ నిరాకరణ ఎదురవడం చర్చనీయాంశమయింది. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరి, ఉద్యోగులను దూరం చేసుకుంటే ఏమవుతుందోనన్న భయం - కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఎందుకీ మినహాయింపు అన్న మిగిలిన ప్రభుత్వ శాఖల ప్రశ్నలపై చర్చకు తెరలేచింది. ప్రభుత్వ ఆదేశాలంటే శిలాశాసనం. ఎవరైనా వాటిని ఆచరించాల్సిందే. కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనే వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల హాజరు - పనితీరు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలుచేస్తోంది. వెలగపూడికి తాత్కాలిక సచివాలయం తరలివెళ్లిన తర్వాత, అక్కడ కూడా ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని - జీఏడీ ఆదేశాలిచ్చింది. అయితే, ఇప్పటివరకూ కేవలం 40 శాతం మంది ఉద్యోగులే బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు ఇచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.
వెలగపూడి సమీపంలో ఉండేందుకు సరైన వసతులు లేవని, తాము మంగళగిరి-గుంటూరు నుంచి రావడంతో ఆలస్యం అవుతుందోని, ఒక్కోసారి సీఎం సెక్యూరిటీ వల్ల కూడా వెలగపూడికి వచ్చేందుకు ఆలస్యమవుతోందంటూ, రకరకాల కారణాలు తెరపైకి తీసుకువస్తున్న ఉద్యోగుల సాకులపై విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకూ ఇలాంటి సమస్యలే కొంచెం అటు ఇటుగా ఉన్నాయని మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు భార్యాపిల్లలను విడిచిపెట్టి వేరొక చోట ఉద్యోగాలు చేస్తున్నారని, ముఖ్యంగా టీచర్లు - రెవిన్యూ - ఆరోగ్యశాఖ సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ ఏళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయాన్ని మరికొందరు వారు గుర్తు చేస్తున్నారు. అయితే తమకెవరికీ లేని మినహాయింపులు సచివాలయ ఉద్యోగులకే ఎందుకన్న ప్రశ్న తాజాగా తెరపైకొచ్చింది. అలాగైతే అన్ని ప్రభుత్వ శాఖలనూ ఈ విధానం నుంచి మినహాయించాలని, వారికి అమలుచేసినప్పుడే తమకూ అమలుచేయాలన్న వాదన మొదలవడంతో బయోమెట్రిక్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండుగా విడిపోయినట్టయింది.ఈ విషయంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులంటే భయపడుతున్నట్లు కనిపిస్తోందని, వారితో ఘర్షణ పెట్టుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోతామన్న ధోరణితోనే మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఉపాధ్యాయ - రెవిన్యూ - వైద్య ఆరోగ్యశాఖ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/