Begin typing your search above and press return to search.
ఏపీ : స్టేట్ రోడ్ టోల్ ఫీజ్ కి రంగం సిద్ధం !
By: Tupaki Desk | 20 Nov 2020 9:10 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న నిబంధనలను ఉత్తర్వులను జారీ కాగా, గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఈ ఫీజులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించేందుకు కార్లు, జీపులకు కిలోమీటర్ కు 90 పైసలు, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు, మినీ బస్సులకు రూపాయి 80 పైసలు, బస్సు, లారీలకు 3 రూపాయల 55 పైసలు, భారీ వాహనాలకు 8 రూపాయల 90 చొప్పున టోల్ ఫీజులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్ర రహదారులు, బైపాస్ లు, వంతెనలు, సొరంగాల పరిధిలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ఫీజుల వసూలుకు 2019-20 మూల ధరలను పరిగణనలోకి తీసుకుని, రూ.20-25 కోట్లతో నిర్మించిన వంతెనలు, సొరంగాల వద్ద కార్లు, జీపులకు రూ.9, తేలికపాటి సరకు రవాణా వాహనాలకు రూ.13.50, బస్సు, లారీలకు రూ.27, భారీ వాహనాలకు రూ.39.60 చొప్పున ఖరారు చేశారు. నిర్మాణ వ్యయం రూ.25 కోట్లు దాటితే ప్రతి రూ.5 కోట్లకు ధర పెరుగుతుంది. ఏటా ఈ టోల్ ఛార్జీలను సమీక్షించి, ఫాస్టాగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాలకు 10 కి.మీ. దూరంలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాలి. టోల్‌ప్లాజాకు 5 కి.మీ. పరిధిలో ఉండే గ్రామాల్లో వాహనదారులకు టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు టోల్ ఫీజు ఉండదు.
ప్రయాణికుల నుండి వసూలు చేసిన టోల్ ఫీజు స్టేట్ హైవేల నిర్వహణకు ఉపయోగించటానికి రాష్ట్ర రహదారుల అభివృద్ధి అథారిటీకి వెళుతుందని ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో, కడప-పులివెందుల, ఏలూరు-జంగారెడ్డిగూడెం మరియు భీమవరం-గుడివాడలతో సహా 35 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే, మిగిలిన 24 మార్గాల్లో టోల్ ఫీజు వసూలు చేయబడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే , ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి ఆదాయం పెంచుకునే ప్రతి అవకాశాన్ని అన్వేషిస్తోంది అని పలువురు ఏపీలో రాష్ట్ర రోడ్డు ఫీజుల వసూళ్లపై పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.