Begin typing your search above and press return to search.
బాబును కొట్టి పంపలేదంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 5 March 2020 5:22 AM GMTనోటికి వచ్చినట్లు మాట్లాడటం ఏపీ సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డికి అలవాటే. పొగిడినట్లుగా ఉంటుంది కానీ అందులో వ్యంగ్యం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం లాంటివి కనిపిస్తుంటాయి. నచ్చినట్లుగా మాట్లాడే క్రమంలో తానేం మాట్లాడుతున్నానన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేయటం జేసీకి అలవాటే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హాట్ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో బాబును కొట్టకపోవటం అదృష్టమన్నారు. బాబును పోలీసులే కింద పడేసి.. చావగొట్టకపోవటం సంతోషకరమన్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన భేషన్న జేసీ.. అతనెప్పటికి తమ వాడేనని వ్యాఖ్యానించారు.
అధినేతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్తంత వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటివేమీ లేకుండా తోచినట్లు మాట్లాడేయటం జేసీకి మొదట్నించి అలవాటే. వైఎస్ హయాంలో మంత్రిగా వ్యవహరించిన జేసీ.. దివంగత మహానేతను ఉద్దేశించి ఒక్కమాట అనేందుకు వెనుకాడేవారు. కనీసం ఎవరైనా వ్యాఖ్యానించాలన్నా.. ఆసక్తిని ప్రదర్శించేవారు కాదు. అలాంటి జేసీ.. పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో మితిమీరిన ఉత్సాహంతో వ్యాఖ్యలు చేయటం గమనార్హం.