Begin typing your search above and press return to search.
వైసీపీ కార్యకర్తట, తర్వాత ఎమ్మెల్యే అట... ఆ తర్వాతే స్పీకరట
By: Tupaki Desk | 10 July 2022 4:42 AM GMT"పచ్చపత్రికలు కావు అవి.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ పక్షపాత పత్రికలకు తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు తెలుసు ప్రజల మనసు. 75 ఏళ్ల వృద్ధురాలు.. సీఎం వైయస్ జగన్ నాయకత్వాన్ని మెచ్చుకుంటుంది. రేపు రాబోయేది సీఎం వైయస్ జగన్ సానుకూల ఓట్లతో 175 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. ప్రతిపక్షాలన్నీ భూస్థాపితం అవుతాయి."
- ఇవీ తమ్మినేని సీతారాం చెబుతున్న మాటలు
శాసన సభ నియామాల ప్రకారం స్పీకర్ పార్టీలకు అతీతంగా ఉండాలి. కానీ ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటూ ఉన్నారు.అయినా కూడా తనని తాను సమర్థించుకుంటున్నారు. గతంలో స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఇదే విధంగా చేశారని చెప్పుకుంటున్నారు. ఆధారాలు కూడా చూపించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ సీతారాం వ్యవహారం పై విపక్షాలు తప్పుపడుతూ ఉన్నాయి. ఆయన ఓ పార్టీకి అనుబంధ సభ్యుడిగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదనే అంటున్నాయి.ఆయన రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందని హితవు చెబుతున్నాయి. నిష్పక్షపాత వైఖరితో ఆయన పనిచేస్తేనే సభ నిర్వహణ సజావుగా సాగుతుందని, కానీ ఆయన పూర్తిగా వైసీపీ కార్యకర్త మాదిరి వ్యవహరించడం ఏమంత సబబుగా లేదని పెదవి విరుస్తున్నాయి.
ఇదే సందర్భంలో స్పీకర్ మాత్రం తనని తాను సమర్థించుకునే ధోరణిలోనే ఉన్నారు. తాను మొదట వైసీపీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నవాడ్ని అని, తరువాత ఎమ్మెల్యే అని., ఆ తరువాతే స్పీకర్ ని అని లాజిక్కులు లాగారు. గతంలో కోడెల వ్యవహరించిన తీరు ఈనాడు రామోజీకి కనిపించ లేదా అని ప్రశ్నిస్తూ.. ఆవేశంతో ఊగిపోయారు.
2024లో ప్రతిపక్షాలన్నీ భూస్థాపితం.. 175 సీట్లతో వైయస్‌ఆర్ సీపీదే విజయం అని కూడా అన్నారు. అంటే టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు అని ఎన్నికల ముందే తేల్చేశారా ? అంటే అంత బాగా మీ అభివృద్ధి కానీ మీ సంక్షేమం కానీ ఉందని అనుకుంటున్నారా ? అని పసుపు పార్టీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. అతి విశ్వాసం కారణంగా గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు తుడుచుకుపెట్టుకుపోయాయని, కనుక అతి విశ్వాసం వద్దే వద్దని హితవు చెబుతున్నాయి. పథకాలు అందిన లబ్ధిదారులు సరే అందని వారు వేలల్లో, లక్షల్లో ఉన్నారు వారి మాట ఏంటి ? అర్హత ఉన్నా కూడా పింఛన్లు ఇవ్వడం లేదే అలాంటప్పుడు అందరికీ సంక్షేమం అన్న మాట ఎలా వర్తిస్తుంది అని ప్రశ్నిస్తున్నాయి.