Begin typing your search above and press return to search.
మారిన బాబు మాట : టీడీపీ డోర్స్ ఓపెన్...?
By: Tupaki Desk | 18 Jun 2022 4:30 PM GMTతెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మాటలు ఇపుడులేవు. మరి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది. బాబుని కాలం ఎందుకు ఇలా మార్చేసింది అంటే అక్కడే మ్యాజిక్ ఉంది. ఆరు నెలల క్రితం వరకూ చూస్తే టీడీపీ సీన్ ఏంటో బాబుకే కాదు టీడీపీలో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక్కసారి ధైర్యం చేసి బాబు జనంలోకి వెళ్లాక అపుడు అర్ధం అయింది ప్రజలు మన వైపే ఉన్నారు అని.
దాంతో బాబు నాడు అన్న కొన్ని మాటలను వెనక్కి తీసుకుంటున్నారు. అంతే కాదు కొత్త నిబంధలకు కూడా పాతరేస్తున్నట్లుగా చెబుతున్నారు. నాడు బాబు అన్న మాటలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళిన వారికి అసలు చోటు లేదు, వారిని ఎప్పటికీ పార్టీలోకి తీసుకోము, ఉన్న వారితోనే కధ నడిపిస్తాం, పార్టీకి ఈ రోజు ఎవరు సేవ చేస్తున్నారో నా బొందో అని పార్టీని పట్టుకుని వేలాడుతున్నారో వారికే అన్ని రకాల అవకాశాలు ఇస్తామని చెప్పారు.
ఇక లాస్ట్ మినిట్ లో వచ్చిన వారిని పార్టీ బాగుంటే వచ్చి చేరిన వారిని అసలు తీసుకోమని కూడా తెగేసి చెప్పారు. ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీ డోర్స్ క్లోజ్ అనేశారు. కానీ ఇపుడు ఏపీ వ్యాప్తంగా టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి బాబులో మార్పు వచ్చిందిట. జనాలకు కావాల్సింది టీడీపీ. ఈసారి క్యాండిడేట్ ఎవరు అయినా సరే ఓటేస్తారు. అంతలా వైసీపీ మీద వ్యతిరేకత పెరిగింది అని కూడా అర్ధమైందిట.
దాంతో పార్టీని వీడి వెళ్ళిన వారిని కూడా తిరిగి తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. పార్టీకి అంగ బలం అర్ధం బలం కూడా ముఖ్యమని, అలా బలమైన నాయకులు నాడు పార్టీని వీడిపోయారని, ఇపుడు వారి మనసు మార్చుకుని వస్తామంటే డోర్స్ ఓపెన్ చేయడంలో తప్పేముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట.
ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రా టూర్ లోనే పలువురు మాజీ టీడీపీ నాయకులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఆయన కూడా వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుని స్వాగతించాలని చూస్తున్నారు అంటున్నారు. వైసీపీ మీద సాగే యుద్ధంలో ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదని కూడా బాబు ఫిక్స్ అయ్యారుట.
ఇదిపుడు ఇతర పార్టీలో ఉన్న వారికి ఆనందాన్ని ఇస్తూంటే టీడీపీలో తమ్ముళ్లకు గుబులు రేపుతోందిట. అయినా సరే బాబు కష్టపడిన వారికే టికెట్ అని చెప్పడంతో ఎవరు వచ్చి చేరినా బాబు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారని అంటున్నారు. దాంతో తొందరలోనే వైసీపీ నుంచి టీడీపీ మాజీలు పెద్ద గ్యాంగ్ ఒకటి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతుంది అని అంటున్నారు.
అదే జరిగితే కనుక వైసీపీకి దెబ్బగానే ఉంటుంది. అంతే కాదు జనంలో కూడా ఒక రకమైన చర్చ మొదలవుతుంది. అలాగే పార్టీలో కూడా అంతర్మధనం స్టార్ట్ అవుతుంది. ఇది శృతి మించితే మాత్రం ఎన్నికలు ఇంకా దూరంలో ఉండగానే వైసీపీ శిబిరంలో కల్లోలమే పుడుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు. అలా జరగాలనే బాబు డోర్స్ కావాలని ఓపెన్ చేస్తున్నారు అని అంటున్నారు.