Begin typing your search above and press return to search.

జగన్ బాగా హర్ట్... టీడీపీ ఓకే అంటే...?

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:43 PM GMT
జగన్ బాగా హర్ట్... టీడీపీ ఓకే అంటే...?
X
జగన్ అన్న నాయకుడు రాజకీయల్లో ఎవరూ పడనన్ని మాటలు పడ్డారు. ఎవరూ కూడా ఆయనలా విమర్శలు అయితే ఎక్కువగా పడలేదు. అయితే ఆ విమర్శలే ఆయన మీద జనంలో సానుభూతిని తెచ్చి బంపర్ మెజారిటీతో సీఎం ని చేశాయి. అది వేరే విషయం కానీ ఎంత జగన్ అయినా ఆయన ఎంత రాజకీయాలలో ఉన్నారనే అనుకున్నా అది హద్దులు దాటుకుని ఫ్యామిలీ వాళ్ల మీదకు వస్తే ఎవరైనా తట్టుకోగలరా. అందుకే ఆయన నిన్నటికి నిన్న మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో తన ఫ్యామిలీ మీద విపక్షాలు విమర్శలు చేయడాన్ని ప్రస్థావించారు.

ఇపుడు బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో ఫేస్ టూ ఫేస్ ఇదే విషయం మాట్లాడారు. మనం మనం రాజకీయాల్లో ఎన్ని అనుకున్నా ఒకే. కానీ కుటుంబాలను మధ్యలోకి లాగడమేంటి అని అచ్చెన్నతో జగన్ కాస్తా గట్టిగానే అన్నారని టాక్. దానికి అయ్యన్న కూడా ధీటుగా బదులిస్తూ ముందు స్టార్ట్ చేసింది మీ వైపు నుంచే అంటూ కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఉదహరించారు అని చెబుతున్నారు.

అయితే జగన్ మాత్రం తాను అన్ని రికార్డులనూ పరిశీలించానని, ముందు టీడీపీ నుంచే ఇది స్టార్ట్ అయిందని చెప్పారట. మీరు ఒకటి అంటే మావాళ్ళు కూడా అలాగే అంటారు. ఇది మంచిది కాదు. స్టాప్ చేయాల్సిందే. మీరు గమ్మున ఉంటే మా వాళ్ళూ ఊరుకుంటారు అని జగన్ అచ్చెన్నతో చెప్పారని అంటున్నారు. మరి దానికి అచ్చెన్న ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ ఇపుడు వైసీపీ టీడీపీ నేతలు అన్నీ హద్దులూ దాటేశారు. ఎన్నికలు చూస్తే దగ్గర పడుతున్నాయి.

నాయకుల నుంచి దిగువ స్థాయి వరకూ కూడా ఈ కుసంస్కృతి వెళ్ళిపోయింది. పైగా సోషల్ మీడియా కూడా ఉంది. దాంతో అటూ ఇటూ కూడా రెచ్చిపోతున్నారు. నిజంగా జగన్ చేసిన ప్రతిపాదన మంచిదే. ఒకనాడు చంద్రబాబు ఇదే విషయం మీద బాధపడ్డారు. ఇపుడు జగన్ కూడా హర్ట్ అవుతున్నారు. చిలికి చిలికి ఇవి గాలి వానలా మారి ఎక్కడికో కధను తీసుకుపోతున్నాయి.

ఎక్కడో ఒక చోట వీటికి స్టాప్ చేస్తేనే మంచిది. రాజకీయ పార్టీలు ఏ విషయంలో సంధి చేసుకోకపోయినా పరవాలేదు కానీ బూతు పురాణాల విషయంలో ఒక ఒప్పందానికి వస్తే ముందు వారు బాగుంటారు. ఆనక ప్రజలు కూడా ఈ మాటల కాలుష్యం నుంచి బయటపడతారు. ఏది ఏమైనా జగన్ హర్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది. టీడీపీ మరి దీనికి ఏమంటుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.