Begin typing your search above and press return to search.
నంబర్ టూ అంటే అతి పెద్ద డౌటానుమానంట...?
By: Tupaki Desk | 21 Nov 2022 4:18 PM GMTనంబర్ వన్ ఓకే. నంబర్ టూ అంటేనే అనేక అర్ధాలు పరమార్ధాలు విశేషాలు, విశేషణాలు ఒక్క లెక్కన పుట్టుకువస్తాయి. దాంతో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ కధలూ కనిపిస్తాయి, ఎన్నో చేదు నిజాలు వినిపిస్తాయి. అందుకే ఏ పార్టీలో అయినా నంబర్ వన్ టూ టెన్ వరకూ ఒక్కరే ఉంటారు. నంబర్ టూ అన్నది ఉండనే ఉండదు.
ఆ తప్పు ఒకసారి కాదు రెండు సార్లు చేశారు ఎన్టీయార్. అందుకే వెన్నుపోట్లకు గురి అయ్యారు. ఇదంతా ఎందుకంటే ఏపీలో మూడవ పార్టీగా బలంగా ముందుకు దూసుకువస్తున్న జనసేనలో ఒకానొక నంబర్ టూ గారి గురించి జనసేనలో చిత్ర విచిత్రమైన చర్చ సాగుతోందిట.
పైగా ఆయనకు అద్వితీయమైన ప్రాధాన్యత ఇస్తూ జనసేన నాయకుడు పవన్ నంబర్ టూ గా కూర్చోబెట్టారని ఎప్పటి నుంచో ఆ పార్టీలో చెప్పుకుంటూ వస్తున్నారని ఒక టాక్. ఇక ఇక్కడ చూస్తే మరో వింత పోలిక కూడా ఉంది. అదేంటి అంటే ఒకానొకప్పుడు ఎన్టీయార్ అనే సినీ ప్రముఖుడి పార్టీలో నంబర్ టూ గా నాదెండ్ల భాస్కరరావు ఉన్నారు. ఆయన్ని ఎన్టీయార్ బాగా నమ్మారు. చివరికి ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.
ఇపుడు యాధృచ్చికంగా ఆయన కుమారుడు, రాజకీయ వారసుడే మరో సినీ ప్రముఖుడి పార్టీలో నంబర్ టూ ప్లేస్ లో ఉన్నారు. దాంతో పాటు అపరిమితమైన ప్రాధాన్యతను పవన్ ఆయనకు ఇవ్వడం కూడా జనసేనలో కొందరికి నచ్చడంలేదు అంటున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన కంటే సీనియర్ అయిన నాదెండ్ల మనోహర్ ని నంబర్ టూ గా చేసి జనసేనలో కీలకం చేశారు.
అయితే ఏపీలో జనసేన పొత్తుల మీద రాజకీయాల మీద ఒక అయోమయం అటు బయట జనాల్లో ఉంది. అలాగే సొంత పార్టీలో ఉంది. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం శపధం చేశారు. అన్ని పార్టీలను కలిపి వ్యతిరేక ఓట్లను కూడా చీలిక లేకుండా రాకుండా చూస్తామని చెప్పుకొచ్చారు.
ఇక అది జరిగిన చాలా కాలం తరువాత ఆయన బీజేపీ తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దారి తనదే అనేశారు. ఈలోగా చంద్రబాబు వచ్చి విజయవాడ హొటల్ లో కలవడంతో ఈ బంధం బహు గట్టిది అనుకున్నారు. కానీ ఇంతలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోడీ నుంచి పిలుపు రావడం ఆయనతో విశాఖలో అరగంటకు పైగా పవన్ భేటీ కావడంతో ఏపీ రాజకీయం మారిపయింది.
ఇక టీడీపీకి దూరంగా ఉంటూ జనసేన బీజేపీతో కలసి ముందుకు సాగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో సడెన్ గా నంబర్ టూ హోదాలో నాదెండ్ల మనోహర్ వచ్చి ఖండించేశారు. బీజేపీ పెద్ద అయిన సోము వీర్రాజు ఏపీలో జనసేన బీజేపీ రెండూ జోడు గుర్రాలు అంటూంటే తాము దాంతో అంగీకరించడంలేదని మనోహర్ కుండ బద్ధలు కొట్టారు.
పొత్తులు అంటే ఎన్నికల సమయంలోనే తప్ప ఇపుడు కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామంటూ బీజేపీకి జోల పాడి టీడీపీలో ఆశలు పెంచేశారు. దీంతోనే ఇపుడు నాదెండ్ల మనోహర్ వైఖరి మీద మరోసారి బలమైన సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది అని అంటున్నారు.
ప్రత్యేకించి సినీ రాజకీయ రంగాలో టీడీపీని దాని ప్రయారిటీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒక వర్గం జనసేన మద్దతుదారులు మనోహర్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన మనోహర్ సీనియర్ నాదెండ్ల తనయుడిగా ఉండడాన్ని కూడా కోరి మరీ ప్రస్తావిస్తున్నారుట. ఆయన్ని పవన్ కళ్యాణ్ మరీ ఎక్కువగా నమ్ముతున్నారు అని కూడా ఒక వర్గం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఆయన ఆలోచనలు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. పైగా ఆయన జనసేన రాజకీయ నౌకను ఏ తీరానికి చేరుస్తారో అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారుట. మరి పవన్ కళ్యాణ్ ఆయన్ని నమ్మారు. ఆయన విషయంలో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మనోహర్ కూడా ఈ నిముషం వరకూ విధేయతగానే ఉన్నారు. అయితే ఇది రాజకీయం కాబట్టి ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. అలాగే అనుమానాలు ఉంటాయి. కాబట్టి పవన్ మనోహర్ కాంబో పాలిటిక్స్ గురించి కూడా ఇపుడే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఏది నిజమో అనుమానమే కూడా అసలు చెప్పలేరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.