Begin typing your search above and press return to search.
ఏపీ తెలంగాణ మీటింగ్.. ఇంత సానుకూలత
By: Tupaki Desk | 8 Feb 2020 4:35 AM GMTఏపీ, తెలంగాణ ఎన్నో వివాదాల మధ్య విడిపోయింది. విడిపోయాక ఏర్పడ్డ రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు నాడు కలహించుకున్నారు. కొట్లాడుకున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మొన్నటి వరకూ ఫైట్ నడించింది. ఇప్పుడు ఏపీకి సీఎంగా జగన్ కావడం.. కేసీఆర్ తో దోస్తీ కావడంతో రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల కీలక అధికారుల బృందం సమావేశమై రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో గల 89 ప్రభుత్వ రంగ సంస్థలు, 53 సంస్థల విభజనపై చర్చించారు.
మునుపటితో పోలిస్తే ఈ దఫా మీటింగ్ లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. నాలుగు సంస్థల విభజనపై విస్తృతంగా చర్చించారు.
ఎప్పుడూ ఉప్పునిప్పుగా జరిగే సమావేశాలు ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల చొరవతో సానుకూల వాతావరణంలో జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇచ్చిపుచ్చుకునే విధానంలో విభజన వివాదాలు పరిష్కరించుకుంటామని తెలిపారు.