Begin typing your search above and press return to search.
జల జగడం: తెలంగాణాకు ఏపీ షాక్..కృష్ణా బోర్డుకు మరో లేఖ !
By: Tupaki Desk | 19 Aug 2021 7:45 AM GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం సద్దుమణగటం లేదు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు మరోమారు లేఖ రాసింది. గతంలోనూ కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ జెన్కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుని అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే కానీ రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు.
చెన్నైకి తాగునీటి కూడా సరఫరా చేయలేమని వెల్లడించారు. విద్యుదుత్పాదనతో వస్తున్న నీటిని సాగర్లో నిలపలేమని ఈఎన్సీ పేర్కొన్నారు. అంతేకాదు పూర్తిస్థాయి నీటిమట్టం సాగర్ లో ఉందని, విద్యుదుత్పాదన కారణంగా వృధాగా పోతున్న జలాలను, తెలంగాణ కోటా నుండి మినహాయించాలని ఏపీ లేఖలో పేర్కొంది. కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకోవటంపై ఏపీ సర్కార్ మరోమారు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది . అంతకు ముందు జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటున్నదని, కృష్ణా రివర్ బోర్డు కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే ఈ అంశంపై మూడు సార్లు లేఖ రాసినా కృష్ణా రివర్ బోర్డు పట్టించుకోవడం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది.ఇప్పుడు మళ్ళీ మరోమారు లేఖ రాసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నదీజలాలపై కేంద్రం గెజిట్ విడుదల చేసి జల వివాదాలను తమ పరిధిలోని తీసుకున్నప్పటికీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటిని దోపిడీ చేస్తోందని తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణ సర్కార్ ఏపీ ప్రభుత్వంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయడం,ఆపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిపుణుల బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించడం చకచకా జరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను వినియోగించుకోవడానికి చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పనులు మోతాదుకు మించి జరుగుతున్నట్టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిపుణుల బృందం గుర్తించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ కోసం ఏ పనులు జరుగుతున్నట్టు ఏపీ ప్రభుత్వం గతంలో వివరించినా క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత ఆ అవసరాల కంటే ఎక్కువగానే భారీ స్థాయిలో పనులు జరుగుతున్నట్లుగా తేలిందని నివేదికలో పేర్కొంది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఈ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అందించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ కోర్టు ధిక్కరణ కు పాల్పడిన అర్థమవుతోందని అభిప్రాయపడింది ఎత్తిపోతల పై తెలంగాణ సమర్పించిన ఫోటోలను పరిశీలించిన ఎన్జీటీ పనులు భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది అని పేర్కొంది పర్యావరణ శాఖతో ఏపీ కుమ్మకై ఇదంతా చేస్తున్నట్లుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది అధికరణ కేసులో గతంలో అది తెలుగు పంపి రా అని ప్రశ్నించిన అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా లేదా, హైకోర్టు ద్వారా జైలుకు పంపాలా అని పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది. ఇప్పటివరకు అధికారులు సూచించిన సందర్భాలు ఎదురుగా లేదని ఎన్జీటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
మొత్తానికి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై తెలంగాణ బిగించిన ఉచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇక ఈ సమయంలో మళ్లీ తాజాగా తెలంగాణ రాష్ట్రం వల్ల తమకు నష్టం జరుగుతుందని, తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని, లేదంటే రాయలసీమకు నీరు ఇవ్వలేమని, చెన్నై తాగునీటి అవసరాలు కూడా తీర్చలేమని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాయడం సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను తెలంగాణ వాటాలో లెక్కించాలని మెలిక పెట్టడం గమనార్హం.