Begin typing your search above and press return to search.
ఏపీ: అవినీతిలో అగ్రస్థానం ఆ జిల్లాకే ..14400 కి భారీ స్పందన !
By: Tupaki Desk | 2 Dec 2019 7:10 AM GMTఅవినీతి ..లంచగుండి తనం ..ప్రస్తుత రోజుల్లో భారీగా పెరిగిపోయింది. ఇక్కడ, అక్కడ అని లేకుండా ప్రతి చోట అవినీతిమయమే. ఏ ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్లి పలానా పని చేయండి అని అడగ్గానే ఆ అధికారుల నోటి నుండి వచ్చే మొదటి మాట ..నీ పని చేసి పెడితే నాకేంటి లాభం ..నాకు ఎంత ఇస్తావ్ . ఇలా తమ అవసరాలకోసం వెళ్లిన వారు కొంతమంది వారు అడిగిన లంచాన్ని ఇచ్చి పని చేపించుకుంటుంటే ..మరికొంతమంది మాత్రం లంచం ఇవ్వలేక ..ప్రాణాలని తీసుకుంటున్నారు. లంచం ఇవ్వలేక ప్రాణాలని తీసుకున్నవారిని మనం ఏంటో మందిని చూసాం.
దీనిపై తాజాగా జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీ అభివృద్దే ద్యేయంగా , ప్రజల రక్షణే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడే అధికారులపై ఉక్కుపాదం మోపనున్నాడు. ఈ అవినీతిని నిర్ములించడానికే 14400 కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని ఏ జిల్లా , ఏ మూల నుండైనా కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి ..వారి సమస్య ఏమిటో చెప్పవచ్చు. ఆలా ఫిర్యాదు ఇచ్చిన 15 రోజుల్లోనే వారి సమస్య పరిష్కారం అయ్యేలా సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు.
అయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు తమకి జరిగిన అన్యాయాల గురించి ఈ నెంబర్ కి కాల్ చేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ 14400 కాల్ సెంటర్‌కు గుంటూరు జిల్లా నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయట. అది కూడా.. అవినీతిపై.. అందులోనూ.. రెవెన్యూ, విద్యుత్, పురపాలక అధికారులపై ఎక్కువగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయట.
బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, భూ రిజిస్ట్రేట్స్, వాటర్ బిల్, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను.. ఇలా అన్నీ కావాలంటే.. లంచం పెట్టనిదే పని జరగట్లేదని వారు అధికారులకి వివరిస్తునట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. రెవెన్యూ శాఖపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని కాల్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. అవినీతికి సంబంధించి.. మొత్తంగా 200లకు పైగానే.. కాల్స్ వచ్చాయట. అయితే.. ఈ వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా.. తగిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారట ఏసీబీ అధికారులు. ఈ కాల్స్ పై రంగంలోకి దిగిన అధికారులు..ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? వారి ఏ పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు? ఏ అధికారి లంచం డిమాండ్ చేశారు..? తదితర విషయాలను ప్రజల నుంచి సేకరిస్తున్నారని సమాచారం. ఆలా వివరాలు సేకరించిన తరువాత నిజంగా ఆ అధికారి లంచం డిమాండ్ చేసాడు అని తెలిస్తే ..చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట.