Begin typing your search above and press return to search.
వారం అగితే..డైనోసార్ రఘును అలా చూసేవాళ్లం
By: Tupaki Desk | 30 Sep 2017 5:21 AM GMTప్రభుత్వ అధికారిగా పని చేసే ఒక ఉన్నతాధికారి అవినీతితో ఎంత సంపాదించొచ్చు అన్న ప్రశ్నకు తెలుగు ప్రజలంతా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారాన్ని అందించారు ఏపీ పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి గోళ్ల వెంకట రఘు. ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ.500 కోట్ల (ఇప్పటివరకూ బయటకు వచ్చినవి మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం. మార్కెట్ ధరల ప్రకారం అయితే మరింత ఎక్కువగా) అక్రమాస్తులు బయటపడి పెను సంచలనంగా మారారు.
నిబంధనలకు నీళ్లు వదిలి ఎలా పని చేయాలి? ఎంత భారీగా సంపదనను సృష్టించాలన్నది రఘు ఉదంతాన్నిచూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన రిటైర్మెంట్ పార్టీని విదేశాల్లోప్లాన్ చేయటమే కాదు.. అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసిన సమయంలో అనూహ్యంగా ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోవటం తెలిసిందే.
తాజాగా రఘుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. రఘు విషయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేయకుండా వారం వ్యవధిలో భారీ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రకటించి ఉండేవారని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్.. అమరావతిల్లో భారీ రియల్ ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేసే వారని చెబుతున్నారు.
రిటైర్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద బిల్డర్లలో తాను ఒకడిగా మారాలన్నదే రఘు లక్ష్యంగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తానుకానీ రియల్ వ్యాపారంలోకి దిగితే తనకున్న సంపదను స్వల్ప వ్యవధిలోనే ఐదారు రెట్లు ఎక్కువ చేసుకోవచ్చన్నది రఘు ఆలోచనగా చెబుతున్నారు. రియల్ వ్యాపారానికి సంబంధించి తన సొంతంగా రూ.100 కోట్ల మేర నిధుల్ని సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్.. అమరావతి రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనడటం.. అపార్ట్ మెంట్లు నిర్మించటంతో పాటు.. పలు రియల్ ప్రాజెక్టులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కలలన్నీ ఒక్క ఏసీబీ రైడ్ తో కల్లలుగా మారాయని చెప్పొచ్చు.