Begin typing your search above and press return to search.
అమ్మ ఒడికి మళ్లీ కోత.. ఇక వచ్చేది రూ.13 వేలే!
By: Tupaki Desk | 21 May 2022 8:30 AM GMTఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి కింద ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హతలు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తోంది. అయితే మొదటి ఏడాది 2020లో ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వగా ఆ తర్వాత దీన్ని రూ. 14,000కు కుదించేశారు. ఆ తగ్గించిన రూ.1000 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు వాడతామని ప్రభుత్వం తెలిపింది. దీంతో గతేడాది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథకం కింద రూ.14 వేలు మాత్రమే అందాయి. తాజాగా ఈ మొత్తంలోనూ మరో రూ.1000 కోత పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.
తాజాగా కోత పెట్టిన రూ.1000ను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే జగనన్న అమ్మ ఒడి ఇక లబ్ధిదారులకు రూ.13 వేలు మాత్రమే అందుతాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు అంతర్గతం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న విద్యాశాఖాధికారులు ఆయా స్కూళ్లకు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారని ప్రాథమికంగా తెలుస్తోంది.
కాగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఐదేళ్లు ఇవ్వాల్సిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని నాలుగేళ్లకు కుదించేశారని ధ్వజమెత్తుతున్నాయి. ముందు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పిందని.. తర్వాత మళ్లీ కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు పేరుతో ఏటా అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యను అమాంతం తగ్గించేస్తున్నారని పేర్కొంటున్నారు. అలాగే ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి.. అందులో మరుగుదొడ్ల నిర్వహణ కోసమంటూ రూ.1000 కుదించి రూ.14 వేలే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను ప్రభుత్వమే శుభ్రం చేయించాల్సి ఉండగా.. విద్యార్థులకు ఇచ్చే మొత్తంలో మినహాయించడం దారుణమని అంటున్నారు.
ఇది చాలదన్నట్టు మళ్లీ ఇప్పుడు ఆ రూ.14 వేల మొత్తంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కోసమంటూ మరో రూ.1000 తగ్గించాలనుకోవడం దారుణమని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే నాడు–నేడు మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను సకల మౌలిక వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని జగన్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటోందని.. మరి రెండోసారి అమ్మ ఒడిలో రూ.1000 కోత వేయడం ఏమిటని నిలదీస్తున్నారు.
అమ్మ ఒడి కింద ఇచ్చే డబ్బులు నాన్న బుడ్డికి కూడా సరిపోవడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అప్పులపాలై ప్రభుత్వ పథకాల్లో కోతలు పెడుతోందని నిప్పులు చెరుగుతున్నారు. అమ్మ ఒడి కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి 50 లక్షలకు పైగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకున్నారని.. ఇలా ఆ పథకంలో కోతలు వేస్తే వాళ్ల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ రూ.15 వేల చొప్పున ఇస్తామని విద్యార్థుల తల్లులందరితో ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు మాత్రం మాట తప్పుతున్నారని మండిపడుతున్నారు.
అలాగే అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు అమ్మ ఒడి కింద ఆర్థిక సాయాన్ని జగన్ ప్రభుత్వం జనవరిలో ఇచ్చిందని.. ఇప్పుడు ఆరు నెలలు ముందుకు జరిపి జూన్‌లో ఇస్తామంటోందని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఇస్తే వచ్చే ఏడాది అంటే 2023లోనే జూన్‌లోనే ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక 2024 జూన్ నాటికి జగన్ ప్రభుత్వం ఉండదని.. ఎందుకంటే అదే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శాసనసభకు ఎన్నికలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో 2024లో ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని జనవరి నుంచి జూన్‌కు జరిపారని అసలు లోగుట్టుని వివరిస్తున్నారు.