Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ మంత్రి అంతగా పోగేసుకున్నారా? : వైసీపీలోనే చ‌ర్చ

By:  Tupaki Desk   |   20 Jun 2022 1:30 AM GMT
వైసీపీ మాజీ మంత్రి అంతగా పోగేసుకున్నారా?  :  వైసీపీలోనే చ‌ర్చ
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో తొలి విడ‌త మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న కృష్నాజిల్లాకు చెందిన ఓ నాయ‌కుడు.. అధికారా న్ని అడ్డు పెట్టుకుని బాగానే పోగేసుకున్నారా?  త‌న జిల్లా ప‌రిధులు దాటి.. పొరుగు రాష్ట్రంలోనూ.. పొరుగు జిల్లాలోనూ ఆయ‌న భారీ ఎత్తున సంపాయించుకున్నారా?  ఇప్పుడు ఆయ‌న‌పై వైసీపీ అధిష్టానం.. నిఘా పెట్టిందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం వైసీపీలో ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఓ కీల‌క‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన స‌ద‌రు మంత్రి త‌ర్వాత జ‌రిగిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చోటు కోల్పోయారు.

దీనిపై అనేక కార‌ణాలు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే.. ఇలా ఎప్పుడూ.. మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేరు. ఎందుకంటే.. ఆయ‌న చాలా సాఫ్ట్‌గా తెలివిగా మాట్లాడ‌తార‌నే పేరుండ‌డ‌మే. అయితే.. ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి స‌ద‌రు మంత్రిపై ఓ ఎంపీ నుంచి ఫిర్యాదులు అందాయి.

అధిష్టానానికి అత్యంత చేరువ‌గా ఉండే స‌ద‌రు ఎంపీ.. ఇటీవ‌ల కాలంలో ఈమాజీ మంత్రిపై నిప్పులు చెరుగుతున్న విష‌యం తెలిసిందే. నేనేంటో చూపిస్తా! అని కూడా స‌వాల్ విసిరారు. అయితే.. ఇదేదో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం చేసుకున్న పోరాటంగానే అంద‌రూ బావించారు.

అయితే.. ఇప్పుడు వైసీపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. స‌ద‌రు మాజీ మంత్రిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే అదిష్టానం ఆయ‌న‌కు రెండో సారి మంత్రిగా చాన్స్ ఇవ్వ‌లేద‌ని .. అంటున్నారు. అంతేకాదు.. స‌ద‌రు మాజీ మంత్రి వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు ముఖ్యంగా బినామీల పేరుతో ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ మైన్‌ను దక్కించుకునే విషయంలో జరిపిన అడ్డగోలు వ్యవహారాలపై అధిష్టానానికి నివేదిక‌లు అందాయ‌ట‌.

అంతేకాదు..  పేదలకు చెందాల్సిన అసైన్డ్‌ భూముల్లో గోదాముల నిర్మాణం, తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌ దగ్గర 100 ఎకరాల కొనుగోలు వంటి అంశాలపై పార్టీ అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ ఎంపీతో కయ్యానికి కాలుదువ్వడాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నియోజకవర్గంలో తన కొడుకు కోసం మిగిలిన నాయకులను ఎదగనీయకుండా అణచివేస్తున్నారన్న ఆరోపణలు అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు మంత్రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ డౌటేన‌ని అంటున్నాయి. ఏదేమైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల ప్ర‌మేయం లేకుండా.. సొంత పార్టీ నేత‌లే.. స‌ద‌రు మాజీ మంత్రిపై విరుచుకుప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.