Begin typing your search above and press return to search.
గుజరాత్‌కు ఏపీ వైసీపీ కీలక నేతలు.. అందుకేనా...?
By: Tupaki Desk | 11 Dec 2022 3:30 PM GMTఏపీ అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో మాజీ ప్రభుత్వ సీనియర్ అధికారిని వెంట బెట్టుకుని గుజరాత్ వెళ్తున్నారని తెలుస్తోంది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో అధికారపార్టీ బీజేపీ అనుసరించిన వ్యూహాలు ఏంటి? ప్రజలకు మళ్లీ మళ్లీ ఎలా చేరువైంది? అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఈ బృందం బయలు దేరుతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఇప్పటికే ఐ-ప్యాక్ బృందం అక్కడ పర్యటించి ఎన్నికలకు ముందుగానే వైసీపీ అధినేత జగన్ కు నివేదిక సమర్పించింది. గుజరాత్ ప్రజల మనసు దోచుకునేందుకు.. బీజేపీ ఇంటింటికీ.. చేరువైంది. అదేవిధంగా మురికివాడల్లో.. పెద్ద ఎత్తున పారిశుధ్య పనులు, ఉపాధి కల్పించింది. చెత్తు ఏరుకుని జీవించేవారికి.. అధునాతన బండ్లు కొనిపించి.. ఆ చెత్తను కార్పొరేషన్ ద్వారా సేకరించి కొంత ఎక్కువ మొత్తాన్ని వారికి అప్పగించింది.
ఉచితాల జోలికి పోకుండా.. ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి ఆరోగ్య కార్డు.. రేషన్ కార్డు ఉండేలా.. చర్యలు తీసుకున్నారు. అంతేకాదు.. పిలిస్తే పలికే వార్డు కౌన్సిలర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి శుక్రవారం.. 'ఆప్ కీ బాత్' పేరిట... ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యల పరిష్కారంపై కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ కూడా.. సక్సెస్‌కు మూలమంత్రాలుగా మారాయనే విశ్లేషణలు ఉన్నాయి.
అయితే.. ఇంతకు మించిఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు ఈ బృందం అన్వేషించనుంది. ఉమ్మారెడ్డి వయో భారంతో ఒకింత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన ప్లేస్‌లో జంగా కృష్ణామూర్తి లేదా.. మరో సీనియర్‌కు అవకాశం ఇచ్చి.. పంపుతారని అంటున్నారు. ముఖ్యంగా వరుస విజయాలు.. విపక్షాల హామీలు.. జనం నాడి వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.