Begin typing your search above and press return to search.
జనం లేరని ఫోటోలు తీస్తారా? వీపులు వాయగొడతాం జాగ్రత్త
By: Tupaki Desk | 31 May 2022 6:30 AM GMTఏపీ అధికారపక్షం నేతల అక్కసు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తమ లోపాల్ని ఎత్తి చూపే వారి విషయంలో వారు వెనుకా ముందు చూడటం లేదు. అధికారంలో ఉన్న వేళ.. తామేం చేసినా నడిచిపోతుందన్నట్లుగా వారి తీరు ఉంటోంది. ఇంతవరకు తమను విమర్శించే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో తమ ‘సత్తా’ చాటిన వైసీపీ నేతలు ఇప్పుడు మరో లెవల్ కు వెళుతున్నారు. తమ ఇమేజ్ డ్యామేజ్ చేసే వారు ఎవరైనా సరే.. వారికి నేరుగా వార్నింగ్ లు జారీ చేస్తున్నారు. అలాంటి తీరును ప్రదర్శించి వార్తల్లోకి వచ్చారు కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రులు కలిసి నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర గురించి తెలిసిందే. కొన్నిచోట్ల ఈ యాత్రకు భారీ స్పందన వస్తే.. మరికొన్నిచోట్ల జనం లేక వెలవెలపోయిన పరిస్థితి. ఆదివారం మధ్యాహ్నం కర్నూలుకు వచ్చిన బస్సుయాత్ర సందర్భంగా వేసిన కుర్చీలు మొత్తం ఖాళీగా ఉండటమే కాదు.. జనాలకు వేయటం కోసం తీసుకొచ్చిన కుర్చీలు సైతం అసలు వేయాల్సిన అవసరమే రాని దుస్థితి.
ఇదే విషయాన్ని ప్రధాన మీడియా సంస్థలు మొదలు మిగిలిన ప్రసార మాధ్యమాలు చూపించాయి. యాత్ర మొత్తానికి మైనస్ గా మారిన ఈ ఉదంతంతో వైసీపీ నేతలు రగిలిపోతున్నారు. చివరి రోజున యాత్రకు అనూహ్యంగా దెబ్బ పడుతుందని ఊహించని వారు.. తమ తప్పులకు మీడియాను బాధ్యత వహించాలన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం.
బస్సుయాత్ర కర్నూలుకు మూడు.. నాలుగు గంటలు ఆలస్యంగా రావటం.. ఎర్రటి ఎండకు తీవ్ర అవస్థలకు గురైన వారు.. వేడికి తాళలేక వెళ్లిపోవటం.. జనసమీకరణ విషయంలో జిల్లా వైసీపీ నేతలు వైఫల్యం కావటంతో యాత్ర పేలవంగా సాగటంతోపాటు.. ఈ అంశం హైలెట్ అయ్యింది.
దీంతో.. దావోస్ లో ఉన్న సీఎం జగన్ సైతం కర్నూలు సభ విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. కర్నూలు నగర మేయర్ కు కోపం వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర పదజాలంతో దూషించారు. మధ్యాహ్నం ఎండ ఉందని నీడ చాటుకు ప్రజలు వెళితే.. ఎవరూ లేరంటూ ఫోటోలు తీసి కొన్ని పత్రికలు పనిగట్టుకొని ప్రచారం చేశాయని విలేకరుల మీద ఫైర్ అయ్యారు.
‘ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం జాగ్రత్త’ అంటూ ఆయన నోరు పారేసుకున్నారు. ఒకవేళ నిజంగానే విలేకరులు తప్పు చేసి ఉంటే.. నీడ చాటున ఉన్న వేలాది మంది జనం ఫోటోల్ని విడుదల చేస్తే.. వీపులు వాయగొట్టాల్సిన అవసరం వైసీపీ నేతలకు రాదు కదా? వారి సంగతి ప్రజలే చూసుకుంటారు కదా?