Begin typing your search above and press return to search.
ఏపీ బీపీ : సుచరితక్క యాక్టివ్ అయ్యిన్రు ! అయ్యారే !
By: Tupaki Desk | 24 May 2022 11:30 PM GMTపాపం అక్క అనగా సుచరితక్క పదవి లేదని ఇంటికే పరిమితం అయిపోయారు. ఏడ్చారు. కన్నీరు పెట్టారు అని రాయాలి. తరువాత తప్పుగా నా పిల్లలు నా ఏడుపును అర్థం చేసుకున్నారు అని కూడా చెప్పారు. ఏదేమయినప్పటికీ జగన్ అన్న వెంటనే ఉంటాను అని అక్క చెప్పి, మోపిదేవి వెంకటరమణకు కూడా అర్థం కాకుండాపోయారు. కానీ ఇప్పుడు అక్క మళ్లీ యాక్టివ్ అయ్యారు.
తన నియోజకవర్గం పరిధిలో అనగా గుంటూరు జిల్లా, ప్రతిపాడులో గడపగడపకూ తిరుగుతూ ఉన్నారు. పథకాలు అందుతున్నాయో లేదో కూడా కనుగొంటూ, ఆరా తీస్తూ, జగనన్నకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఏదేమయినా పదవి ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసమే పనిచేస్తానని చెప్పి, ఆ మాటకు అనుగుణంగా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే.. హోం మంత్రిగా పదవి పోయిన తరువాత సుచరిత చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయారు. తోటి దళితులకు జరిగిన అన్యాయంపై కూడా మాట్లాడ లేదు.
అదేవిధంగా రాష్ట్రంలో గాడి తప్పుతున్న వ్యవస్థలకు సంబంధించి కూడా మాట్లాడలేదు. వాటి ఫలితంగా దళితులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారన్నది కూడా మాట్లాడలేదు. కానీ పార్టీ ఆదేశాల మేరకు నిన్నటి వేళ దిష్టి తీయించుకుని మరీ! నియోజకవర్గంలో కలియదిరిగారు.
సుచరితక్క ఆరోగ్యం బాగుండాలని పదే పదే పలువురు కోరుకోవడం మాత్రం సోషల్ మీడియాలో ఇదే సందర్భంలో వినిపించింది. ఏదేమయినా పార్టీ అప్పగించిన పదవి నచ్చినా నచ్చకున్నా ప్రస్తుతానికి గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా మాత్రం ఆమె తన పొలిటికల్ కెరియర్ ను కొనసాగిస్తుండడం విశేషం. ఇందులో సందేహాలకు తావే లేదు. కానీ మళ్లీ మంత్రి పదవి వస్తుందా? అన్నదే సందేహం మరో రూపాన వినిపిస్తోంది.
ఇక ఇదే సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలలో వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక పోతున్న దుష్టచతుష్టయం అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న అక్క..ఇకపై కూడా ఇంతే వేగంతో పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుకుందాం.