Begin typing your search above and press return to search.

మోడీ సభకు ములాయం చిన్నకోడలు

By:  Tupaki Desk   |   23 Jan 2016 10:21 AM IST
మోడీ సభకు ములాయం చిన్నకోడలు
X
ఉప్పు.. నిప్పులా ఉండే రెండు రాజకీయ పక్షాలు ఒకచోట ఎదురుపడటం ఆసక్తికరమే. మరి.. రాజకీయంగా ప్రత్యర్థులైన పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఒకే వేదిక వద్దకు వస్తే రాజకీయంగా కలకలం సృష్టించక మానదు. తాజాగా అలాంటి పరిణామమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. ఎస్పీ అధినేత ములాయం యాదవ్ చిన్న కోడలు అపర్ణ బిష్త్.. ప్రధాని మోడీ హాజరైన సభకు రావటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అపర్ణ గురించి ఒక్క మాట చెప్పాల్సి ఉంది.

ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అయిన అపర్ణ గతంలోనూ మోడీ షురూ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమె మోడీతో కలిసి తాను దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి ఆసక్తిని పెంచారు. తాజాగా బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో అపర్ణ కనిపించటం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

అయితే.. ఈ విషయాన్ని అపర్ణ తేల్చి పారేస్తూ.. చాలా సింఫుల్ గా.. హుందాగా తేల్చేశారు. మోడీ దేశం మొత్తానికి ప్రధాని అని.. తాను హాజరు కావటంలో ఎలాంటి రాజకీయ పరిణామం లేదని.. వీసీ ఆహ్వానించటంతో మాత్రమే తాను కార్యక్రమానికి వచ్చినట్లుగా పేర్కొని.. ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు.