Begin typing your search above and press return to search.
ఏపీ తప్ప మోదీ, షా గిల్లని ప్రతిపక్ష రాష్ట్రాలేమిటబ్బా..?
By: Tupaki Desk | 27 Aug 2022 9:15 AM GMT"కాంగ్రెస్ రహిత భారత్".. ప్రధాని మోదీ నినాదం ఇది. ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతం కూడా ఇదే కావొచ్చు. ఈ క్రమంలో మోదీకి అండ అమిత్ షా. మోదీ ఆలోచనను షా పక్కాగా అమలు చేస్తుంటారనేది అందరికీ తెలిసిందే. మోదీ మనసును ఆసాంతం చదివే షా.. అందుకుతగ్గట్లు పావులు కదుపుతుంటారు. ఇక మోదీ తన చతురంగా బలాలు షా, ఈడీ, సీబీఐ, ఐటీ లను బరిలో దింపారంటే అవతలి ప్రత్యర్థి డంగైపోవాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు వీరి ధాటిని తట్టుకుని ఎలాగోలా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. నిలదొక్కుకుని బతకడం కష్టం. ఇటీవలి ఉదాహరణలను పరిశీలిస్తే ఇది స్పష్టం.
తమిళనాడు మొదలు..కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలించాలనే మోదీ ప్రయత్నంలో ఇతర పార్టీలు కూడా కొన్నిసార్లు బలవుతుంటాయి. మోదీ, షా వ్యూహం ముందుకెళ్లే యత్నంలో, లేదా వారి మాట వినని సందర్భంలో ఏం జరుగుతుందో ఆరేళ్ల కిందటి తమిళనాడు ఉదంతాన్ని బట్టి చెప్పొచ్చు. దివంగత మహా నాయకి జయలలిత మరణంతో ఖాళీ అయిన తమిళ సీఎం పదవిపై నేడో, రేపో కూర్చుంటుందని భావిస్తున్న శశికళ జైలుపాలయ్యారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన కేసులో కొన్నేళ్ల పాటు కారాగారంలో మగ్గిపోయారు. మోదీ, షా చెప్పిన వ్యూహం ప్రకారం శశికళ
వెళ్లకపోవడమే దీనికి కారణంగా చెబుతారు. ఆ తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్ వర్గాల గొడవతో మొత్తానికే అధికారానికి దూరమైంది. ఇక
కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామి సర్కారుది మూన్నాళ్ల ముచ్చటే. ప్రభుత్వాన్ని నిలువునా కూల్చి.. యడియూరప్పను మళ్లీ సీఎం చేసిన సందర్భం ఇంకా అందరికీ గుర్తుంది. గోవాలోనూ
ఇదే కథ. తమ వారు సీఎం అయితే కానీ మోదీ, షా సంతోషంగా లేరు. ఇక మహారాష్ట్రలో మొన్నటిమొన్న ఏం జరిగిందో అందరూ చూశారు. శివసేన సారథ్యంలోని ప్రభుత్వం ఎలా
పడిపోయిందో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అయితే, కేరళ మాత్రమే బీజేపీకి ఎంత ప్రయత్నించినా ఎంట్రీ ఇవ్వడం లేదు. అక్కడి చైతన్యవంతమైన సమాజం.. వామపక్షాలు, కాంగ్రెస్ బలంగా
ఉండడమే దీనికి కారణం.
ఉత్తరాదిలో పంజాబ్, మధ్యప్రదేశ్..పంజాబ్ లో అమరీందర్ సింగ్.. రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. పటియాలా మహరాజుగా ఆయన ప్రభ పంజాబ్ అంతటా ఉంది. కాంగ్రెస్ తో ఆయనది ఐదు దశాబ్దాల బంధం. సీఎంగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అలాంటి అమరీందర్ నూ తమవైపు లాక్కుంది బీజేపీ. సిద్ధూతో గొడవలకు తోడు, అమరీందర్ బీజేపీ పెద్దలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నట్లు అనుమానం వచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను తప్పించింది.
ఎన్నికలకు అమరీందర్ తో పొత్తు పెట్టుకుని వెళ్లడాన్ని బట్టే బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరించిందో తెలిసిపోతుంది. మరోవైపు జ్యోతిరాదిత్య అండతో మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ సర్కారు ఎలా కొలువుదీరిందో అందరికీ తెలిసిందే. రాజస్థాన్ లో సచిన్ పైలట్ ను ముందుపెట్టి గెహ్లోత్ ను పడగొట్టే ప్రయత్నం చేశారు. ఇక బిహార్ లో బీజేపీ ముప్పును ముందే గ్రహించిన నితీశ్ కుమార్.. కూటమికి బైబై చెప్పి ఆర్జేడీతో కలిశారు. అయితే, ఇప్పడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కుంభకోణంలో ఇరుకున్నారని అంటున్నారు. తాజాగా జార్ఖండ్ లో సీఎం హేమంత్ ను అనర్హుడిని చేసేదాక బీజేపీ నిద్రపోలేదు. హిమాచల్ లో బీజేపీ సంకీర్ణం బలవంతంగా ఏర్పడినదే. ఇక జమ్మూ కశ్మీర్ లో ఏకంగా రాష్ట్ర హోదానే రద్దుచేశారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను టార్గెట్ చేశారు.
బెంగాల్ లో ఓడినా..పశ్చిమ బెంగాల్ లో నిరుడు అధికారంలోకి రాలేకపోయినా.. అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వానికి బీజేపీ కంటిలో నలుసులా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పార్థా చటర్జీ లీలలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, ఎందుకనో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని బీజేపీ కదిలించలేకపోతోంది. అప్పటికీ ఒకటీ రెండు ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు.
తెలంగాణకూ తప్పని కాక.. మరి ఏపీ ఎప్పుడో...? ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. వీటిని బీజేపీ వారే చేస్తున్నారు. అంటే.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపైనా బీజేపీ పెద్దలు గురిపెట్టినట్లున్నారు. అందుకనే తెరపైకి షర్మిలను తెచ్చారనే కథనాలు వచ్చాయి. వీటిలో నిజమెంతో తేలాలి. కాగా, ఇక బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడి వైఎస్ జగన్ ప్రభుత్వం బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తోంది. ప్రస్తుతానికి దాని జోలి లేదు. అయితే, బీజేపీ వారి వ్యూహం ఎలా ఉంటుందంటే.. దీర్ఘకాలికంగా సాగుతుంది. ముందు కొన్నేళ్లు ప్రత్యర్థి, మిత్రులకు అవకాశం ఇచ్చి.. అనంతరం బీజేపీ వారు పాదుకునేందుకు ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో ఇలా ఆరేడేళ్లు టీఆర్ఎస్ కు వదిలేసి ఇప్పుడు బీజేపీ లైన్లోకి బలంగా వచ్చింది. మరి రేపు ఏపీలో ఏం చేస్తుందో..?