Begin typing your search above and press return to search.

నరసపురం ఎంపీ అరెస్టుపై ఏపీసీఐడీ ప్రకటన

By:  Tupaki Desk   |   15 May 2021 3:30 AM GMT
నరసపురం ఎంపీ అరెస్టుపై ఏపీసీఐడీ ప్రకటన
X
నరసాపురం ఎంపీ కె రఘురామ కృష్ణంరాజును శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు ఏపీసీబీసీఐడీ ప్రకటనలో పేర్కొంది. ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేసినట్లు తెలిపింది. రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయని.. అతను కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని.. ప్రభుత్వంపై అసంతృప్తిని ప్రోత్సహిస్తున్నాడని ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ప్రాథమిక విచారణకు ఏడీజీ సిఐడి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ నియమించినట్టు సీఐడీ తెలిపింది.

రఘురామరాజు తన ప్రసంగాల ద్వారా క్రమం తప్పకుండా సమాజంలో ఉద్రిక్తతలను కలిగించేలా క్రమబద్ధమైన ప్రయత్నం చేశారని.. ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే విధంగా వివిధ ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేస్తున్నట్టు తేలిందని సీఐడీ పేర్కొంది. ఉద్దేశపూర్వక చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని, ధిక్కారాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రసంగాలు దోహదపడ్డాయన్నారు. ఇలా వరుస ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు.

కమ్యూనిటీలు మరియు సామాజిక సమూహాలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారని.. ఇది కొన్ని మీడియా ఛానెళ్ళతో కుట్రలో భాగమయ్యాడని సీఐడీ తెలిపింది. సామాజిక- ప్రజల చర్యల్లో ఆటంకాలను పెంచడానికి ప్రయత్నించాడని సీఐడీ తెలిపింది.వీటన్నిటి నేపథ్యంలో పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ఏడీజీ సిఐడి ఆదేశాల మేరకు 124ఎ, 153ఎ, 505 ఆర్ / డబ్ల్యూ 120బి ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారికంగా తెలిపింది.