Begin typing your search above and press return to search.

ఫైనల్ మాట : టికెట్ ఇవ్వనంతే....?

By:  Tupaki Desk   |   19 July 2022 1:30 AM GMT
ఫైనల్ మాట : టికెట్ ఇవ్వనంతే....?
X
జగన్ మనసులో మాట చెప్పేశారు. పనిచేయని వారు టికెట్లు ఆశించవద్దు. నేను కూడా ఇవ్వను, నా మీద అలిగినా కోపం తెచ్చుకున్నా కూడా ఇదే ఫైనల్ అని చెప్పసినట్లుగా సమాచారం. పార్టీ మళ్లీ గెలవాలీ అంటే తనతో పాటు అంతా కష్టపడాలని జగన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో ఈ రొజు ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో జగన్ కుండ బద్దలు కొట్టారు.

పనిచేయని వారి జాబితా రెడీగా ఉంది. వాళ్ళు తీరు మార్చుకోవాలి. లేకపోతే మాత్రం కష్టమే అని చేదు నిజాన్ని చెప్పేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చాలా మంది సీరియస్ గా తీసుకోవడంలేదు అని వర్క్ షాప్ లో జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అలా అయితే ఎలా అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

ఇక ఒక్క రోజు మాత్రమే తిరిగి ఊరుకున్న వారిలో మాజీ మంత్రి ఆళ్ళ నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారని జాబితా బయట పెట్టారు. ఇక మంత్రులలో తీసుకుంటే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రెండు రోజులు మాత్రమే తిరిగి ఆపేశారని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు చూస్తే అయిదుగురు మంత్రులు కనీసం పది రోజులు పట్టుమని తిరగలేదని జగన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని విప్పి చెప్పారు.

ఇలా అయితే అసలు కుదరదు అని ఆయన తేల్చి చెప్పేశారని అంటున్నారు. పనిచేయని వారికి టికెట్లు ఇచ్చే సమస్యే లేదని జగన్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

వస్తున్న సర్వేలలో ఎమ్మెల్యేల పట్ల అంతకంతకు పెరిగిపోతున్న వ్యతిరేకత నేపధ్యంలో కొత్త ముఖాలను బరిలోకి దించడానికే జగన్ పదే పదే ఇలా హెచ్చరికలు చేస్తున్నారు అన్న మాట కూడా ఉంది.

ఏది ఏమైనా జగన్ ఇచ్చిన గడువులో రెండు నెలలు గడచిపోయాయి. ఆరు నెలల టైమ్ మాత్రమే ఉంది. ఈ సమయంలో ఎవరైనా తమ పనితీరుని మెరుగుపరచుకుంటే ఓకే కానీ లేకపోతే నా చేతిలో ఏమీ లేదు అని జగన్ చెప్పేశాక ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.