Begin typing your search above and press return to search.
తెలంగాణకు పవర్ ఆపేస్తామంటున్న ఏపీ జెన్ కో
By: Tupaki Desk | 25 May 2017 4:44 AM GMTతమ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా.. డబ్బులున్న స్టేట్ గా తరచూ చెప్పుకుంటుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మరి.. అంత డబ్బులున్న రాష్ట్రంలో చోటు చేసుకునే కొన్ని వ్యవహారాలు చూసినప్పుడు.. ఇబ్బందికరంగా అనిపించటమే కాదు.. సంపన్న బడాయిని కేసీఆర్ మరీ ఎక్కువగా వినిపిస్తున్నారేమోనన్న భావన కలగటం ఖాయం. తాజా ఉదంతం చూస్తే.. విభజనతో కిందామీదా పడుతున్న ఏపీకి తెలంగాణ అప్పు పడటం.. బకాయిలు చెల్లించకపోవటం ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు.
విద్యుత్ కు సంబంధించి ఏపీకి పెద్ద ఎత్తున తెలంగాణ బకాయిలు పడినట్లుగా చెబుతున్నారు ఏపీ జెన్ కో ఎండీ. తమకు చెల్లించాల్సిన బకాయిల్ని ఈ నెలాఖరు లోపు కానీ చెల్లించకుంటే.. తర్వాత నుంచి విద్యుత్ ఇవ్వమని కరాఖండిగా తేల్చారు. ఈ మేరకు లేఖ కూడా రాయటం గమనార్హం.
తెలంగాణ సంస్థలు 2014 నుంచి ఇప్పటివరకూ రూ.4800 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ జెన్ కో లెక్క తేల్చింది. దీనికి తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు చెప్పగా.. పలుసంప్రదింపుల అనంతరం తెలంగాణ రూ.3200 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ మొత్తం ఇప్పటివరకూ తమకు అందలేదని ఏపీ జెన్ కో ఎండీ చెబుతున్నారు. ఇప్పటికీ ఏపీ నుంచి రోజు పది మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణకు అదనంగా వెళుతోందని ఆయన చెబుతున్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిల్ని ఈ నెలాఖరు లోపు చెల్లించని పక్షంలో విద్యుత్‌ను నిలిపివేయటమే కాదు.. చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని లేఖ రాయటం గమనార్హం. సంపన్న రాష్ట్రంలో.. ఇలాంటి మాటలకు అవకాశం ఇవ్వాల్సి ఉందా? అన్న సందేహం కలగక మానదు. బకాయిల్ని సింగిల్ హ్యాండ్ తో తీసి ఇచ్చేయాల్సింది పోయి.. లేఖలు రాయించుకునే వరకూ తెచ్చుకోవటం ఏమిటన్న అభిప్రాయం కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/