Begin typing your search above and press return to search.
కలాం మరణంపై పాక్ అణుపిత పాడు మాటలు
By: Tupaki Desk | 29 July 2015 9:04 AM GMTచనిపోయింది పగవాడైనా అయ్యో అనటం మనిషి లక్షణం. కానీ.. అలాంటి లక్షణమేమీ తనలో లేదని నిరూపించాడు పాక్ అణుపితగా చెప్పుకునే అబ్దుల్ ఖాదీర్ ఖాన్. మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకస్మిక మృతికి భారతావనంతా విషాదంలో నిండిపోతే.. ఓదార్పు మాటలు తర్వాత.. కలాంపై వ్యక్తిగతంగా విమర్శలు చేసి తనలోని పాడుబుద్ధిని ప్రదర్శించాడు.
కలాం మామూలు శాస్త్రవేత్త అని.. రష్యా సహకారంతోనే భారత మిస్సైల్ మిషన్ జరిగిందని.. అందులో కలాం పాత్ర ఏమీ లేదంటూ దుర్మార్గపు మాటలు చెప్పుకొచ్చాడు. శాటిలైట్ సాంకేతికత.. అస్ట్రో ఫిజిక్స్ విభాగానికి ఆయన ఎలాంటి సేవలు చేసినట్లుగా తనకు గుర్తు లేదని ఇతగాడు నోరు పారేసుకున్నాడు.
పాక్ అణ్వస్త్ర సాంకేతికతను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతగాడు.. ఆకాశం లాంటి కలాం మీద ఉమ్మేసే ప్రయత్నం చేసి.. పలు వర్గాల నుంచి తిట్లు.. శాపనార్థాలు తింటున్నాడు. కలాంకు రాష్ట్రపతి పదవిని చేపట్టే అర్హత లేదని తెగబడ్డ ఆయన ముస్లిం ఓట్ల కోసమే నాటి ప్రభుత్వం అదంతా చేసిందని విమర్శించాడు.
నిజమే.. జియా ఉల్ హక్.. ముషరాఫ్.. లాంటి నియంతల మధ్య బతికే మనిషి.. ప్రజాస్వామ్యం గురించి.. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల గురించి ఏం తెలుసు? భారతదేశంలో ఒక ముస్లిం రాష్ట్రపతి కాగలడు. కానీ.. పాకిస్థాన్ లోని ఒక హిందువు కార్పొరేటర్ కాగాలడా? పదవుల సంగతి తర్వాత స్వేచ్ఛగా బతకగలడా? మన మధ్య లేని మనిషి గురించి నోరు జారే అబ్దుల్ ఖాదీర్ ఖాన్ చూస్తేనే అతడి సంస్కారం అర్థం అవుతోంది. అలాంటి వాడిని బతికి ఉన్నోళ్ల జాబితాలో లెక్కించటం కూడా తప్పేమో..?