Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన జగన్

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:59 AM GMT
ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన జగన్
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఏపీ ఎన్జీవోల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని తాజాగా నోటీసులు పంపడం అధికార వర్గాల్లో కలకలం రేపింది.

కర్నూలుకు చెందిన ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆరోపణలకు స్పందించిన ప్రభుత్వం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఏపీ ఎన్జీవోలకు తాజాగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి తరుఫున ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఏపీ ఎన్జీవోలు ప్రతిపక్ష చంద్రబాబుతో మిలాఖత్ అయ్యి కార్యక్రమాలు నిర్వహించడం జగన్ సర్కారుకు కోపం తెప్పించింది. ఏపీ ఎన్జీవోలు వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఇంకా చంద్రబాబుతో సాన్నిహిత్యం నెరుపుతూ ప్రభుత్వాన్ని ఇరుకుపెడుతున్నారని జగన్ సర్కారు గుర్తించింది. ఈ కోవలోనే 2018లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సమావేశం తిరుపతిలో జరగగా.. చంద్రబాబుతోపాటు మంత్రులను ఏపీ ఎన్జీవోలు ఆహ్వానించారు. 2001లో వచ్చిన జీవో ప్రకారం 264లోని రూల్ 3(2) - ఏ4 ప్రకారం సభ్యులు కాని వారిని ఏపీ ఎన్జీవోలు సమావేశానికి పిలిస్తే ఆ సంఘం గుర్తింపును రద్దు చేయవచ్చు అనే నిబంధన ఉంది. చంద్రబాబు, మంత్రులను పిలవడంపై కర్నూలుకు కెందిన ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా జగన్ సర్కారు నోటీసులు జారీ చేసింది.

ఇక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కు ప్రభుత్వమిచ్చిన స్థలాలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఆగడాలు చెక్ పెట్టేందుకు ఏకంగా సంఘం గుర్తింపు రద్దుకు జగన్ సర్కారు అడుగులు వేయడం సంచలనంగా మారింది.