Begin typing your search above and press return to search.
అపోలో టీంను టీకి రమ్మని పిలిచిన జయ
By: Tupaki Desk | 8 Dec 2016 8:32 AM GMTజయలలిత సెప్టెంబరు 22న ఆసుపత్రిలో చేరినప్పుడు త్వరలోనే తాను ఇంటికి తిరిగి వెళ్తాననే గట్టి నమ్మకంతోనే ఉండేవారట.. అందుకే అపోలో ఆసుపత్రి నర్సులను తనతో పాటు పోయస్ గార్డెన్ కు వస్తే మంచి కాఫీ ఇస్తానని.. అపోలోలో కాఫీ అస్సలు బాలేదని చెప్పేవారట. తనకు సేవలందించే నర్సులతో ఎంతో బాగా మాట్లాడేవారని షీలా అనే ఒక నర్సు వెల్లడించడంతో అపోలోలో అమ్మ ఎలా గడిపారన్నది బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఆరోగ్యం బాలేక ఏమీ తినలేని పరిస్థితి ఉన్నా కష్టపడి తినేవారని వారు చెబుతున్నారు.
అంతేకాుద... అపోలో ఆస్పత్రి కాఫీ ఆమెకు అస్సలు నచ్చేది కాదట. దాంతో అందుకే ఒకరోజు మొత్తం నర్సులు, డాక్టర్లు అందరినీ పిలిచి.. మీరంతా పోయెస్ గార్డెన్‌కు రండి అంటూ ఆహ్వానించి అక్కడ మీకు కొడైనాడు నుంచి తెప్పించి బెస్ట్ టీ ఇప్పిస్తానని చెప్పారట.
కాగా జయకు మొత్తం 16 మంది నర్సులు సేవలందించగా వారిలో షీలా- ఎంవీ రేణుక - చాముండేశ్వరిలను ఆమె బాగా ఇష్టపడేవారట. 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండడంతో వారితో సరదాగా ఉండేవారట. ఒక్కోసారి డ్యూటీ డాక్టర్లను పిలిచి హెయిర్ స్టైల్ మార్చుకోవాలని సలహా ఇచ్చేవారట.