Begin typing your search above and press return to search.
రాహుల్ - మోడీకి సైనికుడి కూతురు జలక్
By: Tupaki Desk | 9 April 2019 11:18 AM GMTపుల్వామా ఉగ్రదాడి సైనికులను రాజకీయం కోసం వాడడాన్ని ఓ సైనికుడి కూతురు ఎలుగెత్తి చాటింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడే దేశంలోని ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కు చెంపపెట్టులా మారాయి. ‘మోడీ, రాహుల్ కోసం నా తండ్రి చనిపోలేదని.. భారత్ కోసం చనిపోయాడని.. మన సైనికులను మీ ఎన్నికల్లో లాగి లబ్ది పొందకండని.. ఎన్నికలయ్యాక ఖచ్చితంగా మమ్మల్ని మీరు మరిచిపోతారు’ అంటూ పుల్వామా దాడిలో మరణించిన సైనికుడు కూతురు అనడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40మంది సీఆర్పీఎఫ్ సైనికుల్లో ఒకరైన కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులు ప్రధాని మోడీకి చెందిన వారు కాదని.. ఎవరినీ రాజకీయాల్లోకి లాగినా మీరు వారిని అవమానించినట్టేనని ఆమె సంచలన కామెంట్లు చేశారు. భారత సైన్యాన్ని మోడీ సేనగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వ్యాఖ్యానించడాన్ని ఆమె ఖండించారు. ప్రతిగా ఇలా మాట్లాడారని తెలిసింది.
పుల్వామా దాడిలో మా నాన్న చనిపోయాక తండోపతండాలుగా మా ఇంటికి వచ్చి కుటుంబం పట్ల ఎనలేని సానుభూతి చూపించారని.. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చివెళ్లారని. కానీ ఆ తర్వాత ఫోన్ చేస్తే ఒక్క రాజకీయ నాయకుడు ఫోన్ ఎత్తలేదని చనిపోయిన కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ట్వీట్ చేయడంతో కాంగ్రెస్, బీజేపీ ఇరుకుపడ్డాయి. ప్రస్తుతం ఈ వీరసైనికుడి కూతురు మాటలు వైరల్ గా మారాయి.