Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల బ్రేక్ పై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీలు

By:  Tupaki Desk   |   7 April 2021 4:41 AM GMT
పరిషత్ ఎన్నికల బ్రేక్ పై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీలు
X
ఏపీలో రేపు జరగబోయే పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఏర్పాట్లు అన్నీ పూర్తి రేపు ఎన్నికలకు సర్వంసిద్ధం చేసిన వేళ హైకోర్టు సింగిల్ జడ్జి ఆపు చేయడంపై సవాల్ చేయాలని డిసైడ్ అయ్యింది.

ఈ క్రమంలోనే సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ ) కార్యదర్శి కన్నబాబు తాజాగా డివిజన్ బెంచ్ ముందు మంగళవారం రాత్రి అప్పీల్ దాఖలు చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థి కాదని.. వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జీ కొట్టేసి ఉండాల్సిందని.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలనే చట్టబద్ధత నిబంధ లేదు అని పిటీషన్ల ో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణ అధికారం ఎస్ఈసీకే ఉంటుందని.. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో అలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో ఆ మొత్తం ఆదేశాల్ని పరిగణలోకి తీసుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు.

కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కోడ్ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించిందని పిటీషన్ లో పేర్కొన్నారు. కోడ్ విధింపును సడలించి.. తదుపరి పోలింగ్ తేదికి నాలుగు వారాలకు ముందు విధించాలని గడువు పెట్టిందని గుర్తు చేశారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి పిటీషన్ లో కోరారు. ఈ అప్పీలుపై బుధవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరుపనుంది.