Begin typing your search above and press return to search.

జగన్ మీటింగులో చప్పట్లు తక్కువ అయ్యాయి... ఎందుకో...?

By:  Tupaki Desk   |   11 Aug 2022 6:52 AM GMT
జగన్ మీటింగులో చప్పట్లు తక్కువ అయ్యాయి... ఎందుకో...?
X
జగన్ అంటేనే జనాలు చప్పట్లు ఒక మోతగా ఉంటుంది సభ. జగన్ని జననేత అని కూడా వైసీపీ వారు పొగుడుతునారు. జనంతోనే జగన్ అని కూడా అంటారు. అలాంటి జగన్ తాడేపల్లి గడప దాటి కదలి వచ్చి సభ పెడితే జనాలు ఎలా ఉర్రూతలూగాలి. చప్పట్లు ఎన్నని మోగిపోవాలి. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఆ సందడి ఉండాలి కదా. కానీ అవేమీ ఇపుడు కనిపించడంలేదు ఎందుకో.

జగన్ ఈ మధ్య ప్రతీ బటన్ నొక్కే పధకాన్ని జనాల మధ్యనే చేస్తున్నారు. కరోనా పుణ్యమాని రెండేళ్ళ పాటు జనంలోకి వెళ్ళలేకపోయిన ముఖ్యమంత్రి ఇపుడు జనం మధ్యనే సభలు పెడుతున్నారు. అయితే జగన్ సభలకు మాత్రం గతంలోలా జనాలు రావడం లేదని విపక్షాలు ఎటూ విమర్శలు చేస్తున్నాయి. అదే విధంగా జగన్ ప్రసంగాలకు కూడా గతంలో మాదిరిగా ఈలలు, గోలలు ఎక్కడా వినిపించడంలేదని కూడా అన్న విమర్శలు ఉన్నాయి.

గతంలో జగన్ మాట్లాడుతున్నంతసేపూ చప్పట్లో మారుమోగేది. జగన్ ఏమి మాట్లాడినా కేరింతలతో అంతటా కనిపించేది. అలాంటి జగన్ సభలు ఇటీవల మాత్రం కళ తప్పుతున్నాయా అంటే నిజమే అంటున్నారు. జగన్ మీటింగులలో తమ ప్రభుత్వం గురించి చాలానే చెబుతున్నారు. ఎక్కువగానే చెబుతున్నారు. గతంలో మాదిరిగా గంభీరంగా మాట్లాడుతున్నారు. భావోద్వేగాన్ని రంగరించి మరీ జగన్ చాలా మాట్లాడుతున్నారు.

అయినా కూడా జనం నుంచి చప్పట్లు అయితే పెద్దగా రావడంలేదు. సభా ప్రాంగణంలో పెద్దగా కళ కట్టడంలేదు. మరి దానికి కారణం ఏటి అని అరా తీస్తే క్యాడర్ మూగబోవడమే అంటున్నారు. జగన్ సభలు అంటే ముందుగా క్యాడరే అక్కడ కనిపించేది.

వారి కోలాహలమే ఎక్కువగా ఉండేది. వారే పెద్దగా సందడి చేసేవారు. అయితే ఇపుడు అంతా సీన్ మారిపోయింది. క్యాడర్ అన్నది సైలెంట్ అయిందో లేక మాకు ఎందుకు వచ్చిన తంటా అని మౌనంగా మూలన కూర్చుందో తెలియదు కానీ జగన్ సభలు మాత్రం గతంలో మాదిరిగా లేవని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే వెలవెలబోతున్నాయి అని కూడా అంటున్నారు. ఇక వైసీపీ నాయకులలో కూడా మునుపటి ఉత్సాహం ఉత్తేజం కనిపించడంలేదు అని అంటున్నారు. అందుకే సభలు కూడా చప్పగా సాగుతున్నాయని అంటున్నారు. జగన్ సభలు చూస్తున్న వారు నాటికీ నేటికీ మధ్య తేడాను ఇట్టే పట్టేస్తున్నారు. ఏదో జరుగుతున్నాయి అంటే అలా అన్నట్లుగా మొక్కుబడిగా సాగుతున్నాయి. అదే టైమ్ లో రొటీన్ వ్యవహారంగానే అంతా తలపిస్తోంది.

మరి ఇపుడే ఇలా ఉంటే మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో జగనే స్టార్ కాంపెయినర్. ఆయనే పవర్ ఫుల్ అట్రాక్షన్. మరి జగన్ స్పీచ్ లకు చప్పట్ల మోత లేకపోతే అపుడు కచ్చితంగా ఆ లోటు అందరికీ అర్ధమవుతుంది. అదే టైమ్ లో జగన్ సభలలో సందడి లేకపోతే దానికీ విపక్షాల సభలకు పోలిక పెడితే డ్యామేజ్ అవుతుంది అని కూడా అంటున్నారు. మరి చూడాలి జగన్ సభలకు చప్పట్ల సందడి ఎందుకు తగ్గింది. వాటిని పెంచే మార్గాలు ఏమిటి అన్నది వైసీపీ వారు ఏ మాత్రమైనా ఆలోచిస్తారో ఏమో చూడాలి మరి.