Begin typing your search above and press return to search.
అంత మంది తిట్టాక దారికి వచ్చిన యాపిల్
By: Tupaki Desk | 29 March 2016 8:50 AM GMTవ్యాపారంలో గుట్టు మంచిదే. కానీ.. అది దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉంటే.. వ్యాపారాన్ని పక్కన పెట్టి దేశ ప్రయోజనాలు.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ మాత్రం తన వ్యాపార గుట్టు మాత్రమే తనకు ముఖ్యమని తెగేసినట్లుగా మాట్లాడటం.. యాపిల్ ఫోన్ అన్ లాక్ ఫీచర్ కు సంబంధించిన గుట్టును రట్టు చేసేందుకు నో అంటే నో అని చెప్పటం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేసినా నో అన్నదే తప్ప తగ్గలేదు. చివరకు కోర్టు కేసులకు సైతం సై అనేసింది.
ఈ వ్యవహారంపై యాపిల్ తీరును తిట్టిపోసినోళ్లూ ఉన్నారు.. మద్దతు పలికినోళ్లు ఉన్నారు. ఉగ్రవాద సంబంధమైన సమాచారం ఉందన్న విషయంలో అమెరికా ప్రభుత్వానికి యాపిల్ సహకారం అందిస్తే బాగుటుందన్న భావన పలువురు నుంచి వ్యక్తమైంది. కానీ.. అలాంటి విషయాల్ని యాపిల్ లైట్ తీసుకున్నప్పటికీ తాజాగా పెరిగిన ఒత్తిడితో చివరకు.. ప్రభుత్వం కోరినట్లుగా అన్ లాక్ గుట్టు విప్పేందుకు రెఢీ అయ్యింది.
గత డిసెంబరులో అమెరికాకు చెందిన ఇద్దరు దంపతులు కాలిఫోర్నియాలో విచక్షణారహితంగా కాల్పులు జరపటం.. వీరి దారుణానికి 14 మంది మరణించటం.. వారికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో వీరి ఫోన్లను ఓపెన్ చేయలని దర్యాప్తు సంస్థలు భావించాయి. కానీ.. అందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు యాపిల్ సంస్థ ససేమిరా అనటం.. దీనిపై కేసులు నమోదు కావటం జరిగాయి. ఎట్టకేలకు యాపిల్ కంపెనీ దిగి వచ్చి.. అన్ లాక్ ఇష్యూ మీద సహకరిస్తామని పేర్కొంది. ఇదేదో ఇంతకాలం సాగతీయకుండా గుట్టుగా ఆ పని పూర్తి చేసి ఉంటే.. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అధికారులకు దొరికే వీలు ఉండేది. ఇంతకాలం ఆగాక.. ఉగ్రవాదులు జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?