Begin typing your search above and press return to search.

ఆపిల్ సీఈఓ వేత‌నంలో కోత పెట్టేశారు

By:  Tupaki Desk   |   7 Jan 2017 12:00 PM GMT
ఆపిల్ సీఈఓ వేత‌నంలో కోత పెట్టేశారు
X
ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్ వేతనంలో కోత పడింది. గత 15 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్‌ ల అమ్మకాలు నిలిచిపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆయనకు 8.7 మిలియన్ డాలర్లు (రూ.59.3 కోట్లు) చెల్లించినట్టు రెగ్యులేటరీకి తెలియజేసింది. మొత్తానికి పదిహేను శాతం జీతం తగ్గించినట్టు తెలుస్తోంది. ఆ ముందు సంవత్సరం ఆయనకు దాదాపు రూ.10.3 మిలియన్ డాలర్లు (రూ.70 కోట్లు) చెల్లించారు. అయితే ముఖ్యంగా ఆపిల్ ఆదాయం - నిర్వహణ లాభాలు తగ్గుముఖం పట్టడంతో ఆపిల్‌లో పనిచేస్తోన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌ ల వేతనాల్లో కోత విధించినట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా... భారత్‌ లో తయారీ కేంద్రం ఏర్పాటుకు అదనపు రాయితీలు ఇవ్వాల్సిందిగా యాపిల్‌ పెట్టుకున్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/