Begin typing your search above and press return to search.
ఐఫోన్ లాంచింగ్ ఆలస్యం ఖరీదు రూ.7.42లక్షల కోట్లు?
By: Tupaki Desk | 30 Oct 2020 3:10 PM GMTఆలస్యానికి మూల్యం కొన్నిసార్లు ఊహకు అందని రీతిలో ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతం బయటకు వచ్చింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్.. తన తాజా ఐఫోన్ 12ను మార్కెట్లోకి తీసుకురావటంలో ఆలస్యమైన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆ కంపెనీ ఫ్యూచర్ స్టాక్ విలువ ఐదు శాతం పతనమైంది. చూసేందుకు ఐదు శాతమే అయినా.. దాని విలువ భారీగా ఉన్నట్లు లెక్క కట్టారు. అనుకున్న సమయానికి మార్కెట్లోకి ఐఫోన్ 12ను తీసుకురావటంలో జరిగిన ఆలస్యానికి వంద బిలియన్ డాలర్ల మొత్తం పతనమైందని చెబుతున్నారు.
మొత్తంగా విక్రయాల్లో 20.7 శాతం తగ్గినప్పటికి.. మిగిలిన వాటి అమ్మకాలు కవర్ చేశాయి. దీంతో మొదట్లో అంచనా వేసిన దానితో పోలిస్తే.. త్రైమాసిక లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా ఒక్కో షేరుకు 0.73 డాలర్ల ఆదాయం వచ్చేలా చేసింది. అనుకున్న సమయానికి ఐఫోన్ మార్కెట్లోకి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. దీంతో పాటు.. చైనా మార్కెట్లో ఈసారి అమ్మకాలు 29 శాతం తగ్గటం కంపెనీ లాభాల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. మార్కెట్లోకి యాపిల్ 12 సిరీస్ వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగైనట్లుగా కంపెనీ చెబుతోంది.