Begin typing your search above and press return to search.

బ్యాటరీలు వీక్.. వినియోగదారులకు ‘ఆపిల్’ పరిహారం

By:  Tupaki Desk   |   22 Nov 2020 1:30 AM GMT
బ్యాటరీలు వీక్.. వినియోగదారులకు ‘ఆపిల్’ పరిహారం
X
ఉద్దేశపూర్వకంగా పాత ఐఫోన్ ల బ్యాటరీల జీవితాన్ని తగ్గిస్తున్నట్టు టెక్ దిగ్గజం ‘యాపిల్’పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అమెరికాలో కాలిఫోర్నియా, అరిజోనాతో సహా 34 రాష్ట్రాల్లో వినియోగదారులు కోర్టుకు ఎక్కారు. 2017లో కొన్న ఐఫోన్ బ్యాటరీ సమస్యల పరిష్కార విషయంలో పారదర్శకంగా ఆపిల్ కంపెనీ వ్యవహరించడం లేదని ఆరోపించారు. దీంతో 34 రాష్ట్రాలకు 113 మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించడానికి ఆపిల్ కంపెనీ అంగీకరించింది.

2017లో పాత ఐఫోన్ల పనితీరును తగ్గించేలా ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేసిన మాట నిజమేనని ఆపిల్ సంస్థ అంగీకరించింది. పాత బ్యాటరీలు మార్చుకునే వారికి తక్కువ ధరకే కొత్త బ్యాటరీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బ్యాటరీల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఏడాదిలో ఓ కొత్త సాఫ్ట్ వేర్ ను తీసుకురానున్నట్లు వివరించింది.

అంతేకాదు.. ఐఫోన్ బ్యాటరీ ధరను 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు అంటే 63శాతం తగ్గిస్తున్నట్టుగా యాపిల్ పేర్కొంది. ఈ మేరకు వినియోగదారులకు ఆపిల్ ఒక ప్రకటనలో క్షమాపణలు చెప్పింది.

పాత ఐఫోన్లు మరింత కాలం మన్నాలనే ఉద్దేశంతోనే తాము ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేశామని.. దీనిపై వినియోగదారుల్లో అనేక సందేహాలు తలెత్తినట్లు యాపిల్ పేర్కొంది.