Begin typing your search above and press return to search.

భారత్ లోకి ఆపిల్.. పెట్టుబడికి రెడీ

By:  Tupaki Desk   |   23 Sep 2022 4:18 AM GMT
భారత్ లోకి ఆపిల్.. పెట్టుబడికి రెడీ
X
ఆపిల్ కంపెనీ. ఈ ప్రపంచ టెక్ దిగ్గజ ఫోన్ల తయారీ. ప్రతీ ఏడాదికి.. రెండేళ్లకు ఈ ఫోన్ వస్తుందంటే చాలు టెక్ ప్రియులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీనికి అప్డేట్ అయిపోయవాలని వెంపర్లాడుతారు. కొనుగోలుకు ఎగబడుతుంటారు. యాపిల్ కు అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ 'చైనా'నే. చైనాలో యాపిల్ ఫోన్లకు తెగ డిమాండ్. అయితే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం ఆపిల్ సంస్థ డైరెక్ట్ అమ్మకాలు, స్టోర్లు , కొనుగోళ్లకు సరిపడా మార్కెటింగ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి ఆపిల్ అడుగులు వేస్తోంది.

వ్యాపార ప్రపంచంలోని తాజా సమాచారం ప్రకారం.. 2025 నాటికి ఆపిల్ కంపెనీ తన మొత్తం ఐఫోన్ ఉత్పత్తి శ్రేణిలో 25% భారత్‌కు తరలించడానికి సిద్దమైంది. ప్రస్తుతానికి యాపిల్ ఫోన్లకు చైనాలో తెగ డిమాండ్ ఉంది. వినియోగం ఉంది. దాని సరఫరా గొలుసును విస్తరించే ప్రయత్నం లో ఇండియాకు తరలించడానికి రెడీ అయ్యింది. రాబోయే రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14తో సహా కొన్ని ఐఫోన్ మోడల్‌లను భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నారు.

ఇటీవలి వరకు చైనా దాని ఉత్పత్తి స్థావరంగా ఉన్నప్పటికీ.. కంపెనీ సరఫరాదారులను.. ఉత్పత్తి మార్గాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి దృష్టి సారించింది. 2022 చివరి నాటికి ఐఫోన్ ఉత్పత్తిలో 5% భారతదేశానికి తరలించబడుతుందని, అయితే వాస్తవ మార్పుకు మరో మూడు సంవత్సరాలు పట్టవచ్చని చెబుతున్నారు.

అలాగే, 2025 నాటికి ఆపిల్ తన ఉత్పత్తి శ్రేణిలో 25% చైనా వెలుపల ఎయిర్‌పాడ్‌లు, మాక్, యాపిల్ వాచ్ మరియు ఐప్యాడ్‌లతో సహా భారతదేశానికి తరలించాలని భావిస్తోంది. ఫాక్స్ కాన్ వంటి ఆపిల్ సరఫరాదారులు ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సప్లై చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాక్టరీలు మరియు శిక్షణను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. కంపెనీ గోప్యత విధానం లో విషయాలు బయటకు చెప్పనప్పటికీ.. యాపిల్ కొన్ని వారాల్లో భారతదేశంలో ఐఫోన్ 14 ఉత్పత్తిని ప్రారంభిస్తుందని సమాచారం.

అదే సమయంలో వియత్నాం 2025 నాటికి మొత్తం ఐప్యాడ్ మరియు యాపిల్ వాచ్ ప్రొడక్షన్‌లలో 20%, మ్యాక్‌బుక్‌లో 5% మరియు ఎయిర్‌పాడ్‌లలో 65% సహకారం అందిస్తుంది. భారీ మానవ వనరులు, తగినంత శ్రమతో పాటు పోటీ వ్యయాలు భారతదేశాన్ని ఆపిల్ కు గమ్యస్థానంగా మార్చాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.