Begin typing your search above and press return to search.

ఆపిల్ ఫోన్ల ధ‌ర‌లు లీక్‌..ఎంత ధ‌ర అంటే

By:  Tupaki Desk   |   12 Sep 2018 5:48 AM GMT
ఆపిల్ ఫోన్ల ధ‌ర‌లు లీక్‌..ఎంత ధ‌ర అంటే
X
ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ నెల వ‌స్తుందంటే చాలు.. ఐఫోన్ ప్రియులు నూత‌న ఐఫోన్ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. కొత్త‌గా విడుద‌ల‌య్యే ఐఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నూత‌న ఐఫోన్లు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. నేడు యాపిల్ పార్క్ క్యాంపస్‌ లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌ లో గ్యాదర్ రౌండ్ పేరిట యాపిల్ ఓ ఈవెంట్‌ ను నిర్వహించనుంది. అందులో నూతన ఐఫోన్లు - స్మార్ట్‌ వాచ్‌ లతోపాటు యాపిల్ ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్‌ లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌ లో గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ ను నిర్వహించడానికంటే ముందే... ఫోన‌ల్ ధ‌ర‌లు లీక‌య్యాయి.

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు ప్రస్తుతం లీకవ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. యాపిల్ తన గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ లో మూడు ఐఫోన్లను విడుదల చేయవచ్చని తెలిసింది. ఐఫోన్ 10ఎస్ - 10ఎస్ ప్లస్ - 10సి ఫోన్లను విడుదల చేయవచ్చని సమాచారం. ఐఫోన్ 10సి ఫోన్ ప్రారంభ ధర రూ.61వేలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే 10ఎస్ ప్రారంభ ధర రూ.77వేలు - 10ఎస్ ప్లస్ ప్రారంభ ధర రూ.88వేలుగా ఉండనుందని తెలిసింది. ఇక ఈ మూడు ఫోన్లు 64 - 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్నాయని సమాచారం. అదేవిధంగా ఐఫోఎన్ 10ఎస్ - 10ఎస్ ప్లస్ ఫోన్లకు గాను 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ను విడుదల చేయవచ్చని తెలిసింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇంటర్నెట్‌ లో వస్తున్న ఊహాగానాలే. వీటిలో నిజం ఎంతో తెలియాలంటే.. మరికొద్ది గంటలు ఆగక తప్పదు..!