Begin typing your search above and press return to search.
ఆపిల్ ఫోన్ లతో కొత్త ఇబ్బంది....
By: Tupaki Desk | 26 Aug 2015 6:57 AM GMTఆపిల్ ఐఫోన్ అంటే ఉన్న క్రేజే వేరు. అయితే ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 6 ప్లస్ తో ఫొటోలు తీస్తుంటే మసకగా ఉంటున్నాయా? ఇందుకు ఫోటో స్పాట్, సీన్ సరిగా లేదని భావిస్తున్నారా? అది మీ తప్పు కాదు.. ఫోన్ కెమేరా లోనే ఫాల్ట్ ఉందని ఆపిల్ కంపెనీ ప్రకటించింది. పరిష్కారం కూడా చూపెట్టింది.
ఆపిల్ కంపెనీ.. తర వినియోగదారులకు పరిమితంగా కొత్త ఐసైట్ కెమేరాలను ఉచితంగా రీప్లేస్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. అందుకోసం ప్రత్యేక 'వెబ్ పేజీ'ని క్రియేట్ చేసింది. ఐఫోన్ ఉన్నవారు తమ ఫోన్ కు ప్రాబ్లమ్ ఉందో లేదో ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫొటోలు మసకగా వస్తున్నాయని పలు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపిల్ వివరించింది.
ఇలా ఎఫెక్ట్ అయిన ఫోన్ లు 2014 సెప్టెంబర్ నుంచి జనవరి 2015 మధ్యలో సేల్ అయ్యాయని కంపెనీ తెలిపింది.మీకు ఈ సమస్య ఉంటే గనుక ఆపిల్ వెబ్ పేజి https://www.apple.com/support/iphone6plus-isightcamera/'కి వెళ్లి ఫోన్ సీరియల్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఈ నెంబర్ ను ఫోన్ సెట్టింగ్స్ లో జనరల్ సెక్షన్ లో చూడవచ్చు. ఇది మీ ఐ ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ప్యాకేజీలో కూడా పొందవచ్చు.